ManaEnadu:మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనది.. అతి పెద్ద అవయవం కాలేయం (లివర్). లివర్.. మూడొంతులు పాడైపోయినా.. తిరిగి తనంతట తానే బాగు పడగలదు. జస్ట్ పావు వంతు ఆరోగ్యంగా ఉన్నా సరే.. రికవర్ అవ్వగలదు. కానీ చాలా మంది ఇప్పుడు లివర్ డ్యామేజ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం.. మద్యపానం, ధూమపానం అనుకుంటారంతా. కానీ అవి రెండు మాత్రమే అసలు కారణాలు కాదు.
ఆరోగ్యకరమైన కాలేయం పాడయ్యేందుకు మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు కూడా ప్రభావితం చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలకు తప్పకుండా దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలా చేస్తేనే.. లివర్ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజలీ దేవి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందామా..?
ప్రాసెస్డ్ ఫుడ్ : చాలా మంది ఫ్రైడ్ ఫుడ్ (వేపుళ్లు) ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు డాక్టర్లు. దీంతోపాటు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కూడా కాలేయానికి చెడు చేస్తాయట. ఇందులో ఉపయోగించే ప్రాసెసింగ్ పదార్థాలు ఆరోగ్యానికి హానికరం చేస్తాయట.
కూల్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ వల్ల కాలేయం త్వరగా చెడిపోతుందట. చక్కెర, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల లివర్లో పేరుకుపోయి కొవ్వుగా మారి పనితీరు మందగిస్తుందని అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరిగి కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.
కొవ్వు పదార్థాలు : కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుందట. వెన్న, నెయ్యి, చీజ్, రెడ్ మీట్ వంటి ఆహారాల్లో కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్లు : పిండి పదార్థాలతో ఫ్యాటీ లివర్ పెరుగుతుందట. రసాయనాలతో పండించిన ఆహారం తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ మీట్ : జంతువుల మాంసం కూడా కాలేయంపై ప్రభావాన్ని చూపెడుతుందని డాక్టర్లు అంటున్నారు. రసాయనాలతో ప్రాసెస్ చేసిన మాంసం కాలేయానికి చెడు చేస్తుందట.
గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.