బీపీ ఉంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనా?

ManaEnadu:ఒకప్పుడు ఐదు పదుల వయసు దాటిన వారిలోనే బీపీ (రక్తపోటు) కనిపించేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయసులోనూ కనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల వల్ల నేటి తరంలో ఎక్కువ మంది బీపీ బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో -WHO) అంచనా వేసింది. ఒక్కసారి బీపీ ఎటాక్​ అయిన తర్వాత జీవితాంతం మందులు వాడాల్సిందేనా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా.. 

మందులు క్రమం తప్పకుండా వాడిన తర్వాత బీపీ తగ్గినట్టు అనిపిస్తే డాక్టర్​ను సంప్రదించాలి. మందులు ఆపిన తర్వాత బీపీ పెరిగిందా? లేదా తగ్గిందా? అనేది పరిశీలించి వారి సలహా మేరకు మాత్రమే మందుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. నార్మల్ అయిపోయింది కదా అని సొంతంగా మందులు బంద్ చేయడం సరికాదని చెబుతున్నారు.

సాధారణంగా బీపీ 120/80 ఉండటం మంచిది. ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంటే చికిత్స అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, మైకం, వంటి సమస్యలు ఉంటే బీపీ ఉన్నట్లు నిర్ధరిస్తారని ప్రముఖ జనరల్​ ఫిజీషియన్​ డాక్టర్​ గిల్లా నవోదయ్​ అంటున్నారు. అయితే డాక్టర్లు మొదట్లోనే బీపీకి మందులు ఇవ్వరన్న ఆయన.. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ మార్పులు ఏంటంటే.. 

ఫుడ్ : ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం, పొటాషియం, ఫైబర్​ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

వ్యాయామం: వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఉత్తమం. వాటర్​ ఎక్కువ తాగాలని, సరిపడా నిద్ర పోవాలని చెబుతున్నారు.

లైఫ్ స్టైల్ లో మార్పులు : స్మోకింగ్​, డ్రింకింగ్​ వంటి అలవాట్లు మానుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలి.

గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే.  వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Sonia Gandhi: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఏమైందంటే!

కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *