ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ మెట్రో ‘X’ అకౌంట్ హ్యాక్

ManaEnadu : ఇటీవల సైబర్ నేరాలు (Cyber Crimes) ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్​ల సైబర్ కేటుగాళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అమాయకులను ఎరగా చేసుకుని వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల జీ-మెయిల్, వాట్సాప్ (WhatsApp), ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పలు సంస్థల అఫీషియల్ సోషల్ అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తూ కస్టమర్లను దోచేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో X అకౌంట్ హ్యాక్

తాజాగా హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) ఎక్స్‌ (గతంలో ట్విటర్) అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన జారీ చేసింది. తమ ఎక్స్‌ హ్యాండిల్‌ @Itmhyd హ్యాక్ అయిందని తెలిపింది. అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని సూచించింది. ఖాతాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని.. త్వరలో మీకు సమాచారం అందిస్తామని వెల్లడించింది. అప్పటి వరకు అందులో వచ్చే పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రయాణికుల (Metro Passengers)ను అప్రమత్తం చేసింది.

ప్రయాణికులారా బీ అలర్ట్

“@Itmhyd హ్యాక్ అయింది. కస్టమర్లు, యూజర్స్ ఎవరూ మేం చెప్పే వరకు ఈ అకౌంట్​లో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దు. అలాగే ఈ అకౌంట్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదించినా నమ్మకూడదు. ప్రస్తుతం అకౌంట్ పునరుద్ధరించే పనిలో ఉన్నాం. వీలైనంత త్వరగా రీస్టోరీ చేసి ఆ సమాచారాన్ని మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటి వరకూ మీరు జాగ్రత్త” అని హైదరాబాద్ మెట్రో తన ప్రకటనలో పేర్కొంది.

మెట్రో అలర్ట్ మెసేజ్

ఇక సోషల్ మీడియాలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro Social Media) చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటూ ప్రయాణికులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఎక్స్ అకౌంట్ హ్యాక్ (Hyderabad Metro Twitter Hack) అవ్వడంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు ప్రయాణికులను మోసం చేసే అవకాశం ఉందని గ్రహించి హైదరాబాద్ మెట్రో అలర్ట్ మెసేజ్​తో వారిని అప్రమత్తం చేసింది.

 

Share post:

లేటెస్ట్