మన Enadu: నాచారం ఇండస్ట్రీయల్ పరిధిలోని మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రసాయనాలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పోగలతో కంపెనీ చుట్టూ మంటలు వ్యాపించాయి. అప్పటికే కంపెనీలో ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతోందో తెలియక భయంతో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు కాపాడాలంటూ బయటపడ్డారు.
శ్రీకర్ కంపెనీ పక్కనే ఉన్న కంపెనీ ఉద్యోగులు అప్రమత్తం అయ్యారు. మల్కాజిగిరి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.