ఏలియన్స్ ఉన్నాయి.. వాటితో మనకు యుద్ధం తప్పదు : ఇస్రో ఛైర్మన్

ManaEnadu:విశ్వంలో ఏలియన్స్‌పై అనేక ఊహాగానాలున్నాయి. ఎక్కడో ఓ చోట ఏలియన్స్ ఉండొచ్చని కొందరు అంటుంటే.. అలాంటి ఆధారాలే లేవని మరికొందరు వాదిస్తుంటారు. ‘అమెరికా వద్ద గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఉంది. ఏలియన్లపై సమాచారాన్ని అగ్రరాజ్యం దాచిపెడుతోంది.’ అంటూ కొన్నాళ్ల క్రితం వచ్చిన వార్తలు పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. కొంతకాలం తర్వాత ఆ వార్తలు కాలగర్భంలో కలిసిపోయాయి.

అయితే తాజాగా ఏలియన్స్ ఉనికి గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఏలియన్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.రణవీర్ అల్లాబాడియా పాడ్ కాస్ట్​లో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండే అవకాశం ఉందని అన్నారు. వందల ఏళ్లుగా భూమిపై ఉన్న మనుషులు ఎలా అభివృద్ధి చెందారో.. విశ్వంలో ఉన్న మిగతా జీవులు కూడా పరిణామం చెంది ఉంటాయని ఆయన తెలిపారు.

అయితే మనకంటే కొన్ని జీవరాశులు టెక్నాలజీలో చాలా అప్డేడెట్​గా కూడా ఉండొచ్చని సోమనాథ్ చెప్పారు. భూమిపై కాకుండా వేరే ఎక్కడైనా మనకన్నా చాలా ఏళ్లు వెనకబడి కూడా ఉండొచ్చని తెలిపారు. వందేళ్ల క్రితంతో పోలిస్తే భూమిపై టెక్నాలజీ విపరీతంగా అడ్వాన్స్ అయిందన్న ఆయన.. ఈ వేగవంతమైన పరిణామమే ముందు ముందు ఏలియన్స్ ఉనికి గురించి తెలియజేస్తుందని పేర్కొన్నారు.

ఏలియన్స్ భూమిపైకి వస్తే జరిగే నష్టాలను వివరిస్తూ.. భూమ్మీద ఉన్న జీవులతో పోలిస్తే ఏలియన్స్ పూర్తిగా భిన్నంగా ఉంటారని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్అ భిప్రాయపడ్డారు. వారి శరీరం జినోమిక్, ప్రోటీన్​తో నిర్మితమై ఉండొచ్చని తెలిపారు. మానవులు, ఏలియన్స్ మధ్య భవిష్యత్​లో యుద్ధాలు జరిగే ఆస్కారం కూడా ఉందని చెప్పారు. ఆధిపత్యం కోసం ఈ పోరు జరిగే అవకాశం ఉందని సోమనాథ్ అంచనా వేశారు.

Related Posts

Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం

ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *