ManaEnadu:విశ్వంలో ఏలియన్స్‌పై అనేక ఊహాగానాలున్నాయి. ఎక్కడో ఓ చోట ఏలియన్స్ ఉండొచ్చని కొందరు అంటుంటే.. అలాంటి ఆధారాలే లేవని మరికొందరు వాదిస్తుంటారు. ‘అమెరికా వద్ద గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఉంది. ఏలియన్లపై సమాచారాన్ని అగ్రరాజ్యం దాచిపెడుతోంది.’ అంటూ కొన్నాళ్ల క్రితం వచ్చిన వార్తలు పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. కొంతకాలం తర్వాత ఆ వార్తలు కాలగర్భంలో కలిసిపోయాయి.
అయితే తాజాగా ఏలియన్స్ ఉనికి గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఏలియన్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.రణవీర్ అల్లాబాడియా పాడ్ కాస్ట్లో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండే అవకాశం ఉందని అన్నారు. వందల ఏళ్లుగా భూమిపై ఉన్న మనుషులు ఎలా అభివృద్ధి చెందారో.. విశ్వంలో ఉన్న మిగతా జీవులు కూడా పరిణామం చెంది ఉంటాయని ఆయన తెలిపారు.
అయితే మనకంటే కొన్ని జీవరాశులు టెక్నాలజీలో చాలా అప్డేడెట్గా కూడా ఉండొచ్చని సోమనాథ్ చెప్పారు. భూమిపై కాకుండా వేరే ఎక్కడైనా మనకన్నా చాలా ఏళ్లు వెనకబడి కూడా ఉండొచ్చని తెలిపారు. వందేళ్ల క్రితంతో పోలిస్తే భూమిపై టెక్నాలజీ విపరీతంగా అడ్వాన్స్ అయిందన్న ఆయన.. ఈ వేగవంతమైన పరిణామమే ముందు ముందు ఏలియన్స్ ఉనికి గురించి తెలియజేస్తుందని పేర్కొన్నారు.
ఏలియన్స్ భూమిపైకి వస్తే జరిగే నష్టాలను వివరిస్తూ.. భూమ్మీద ఉన్న జీవులతో పోలిస్తే ఏలియన్స్ పూర్తిగా భిన్నంగా ఉంటారని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్అ భిప్రాయపడ్డారు. వారి శరీరం జినోమిక్, ప్రోటీన్‌తో నిర్మితమై ఉండొచ్చని తెలిపారు. మానవులు, ఏలియన్స్ మధ్య భవిష్యత్‌లో యుద్ధాలు జరిగే ఆస్కారం కూడా ఉందని చెప్పారు. ఆధిపత్యం కోసం ఈ పోరు జరిగే అవకాశం ఉందని సోమనాథ్ అంచనా వేశారు.