పరీక్ష లేకుండానే వెస్ట్రన్​ రైల్వేలో ‘స్పోర్ట్స్ కోటా’ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

ManaEnadu:నిరుద్యోగులకు అలర్ట్. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్​ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-సీ, గ్రూప్-డీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హులు సెప్టెంబర్‌ 14వ తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. లెవెల్‌-4/5..  5 పోస్టులు, లెవెల్‌-2/3.. 16 పోస్టులు, లెవెల్‌-1.. 43 పోస్టులు, మొత్తం పోస్టులు 64 ఉన్నట్లు తెలిపింది. 

లెవెల్‌-4/5 పోస్టులకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలని.. లెవెల్‌-2/3 పోస్టులకు అభ్యర్థులు ఐటీఐ, పన్నెండో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలని వెల్లడించింది. లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు మిగతా అన్ని లెవల్స్ కు బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలని పేర్కొంది. అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని వివరించింది. 

దరఖాస్తు రుసుం

జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.500, ఈబీసీ, (ఎక్స్​-సర్వీస్​మెన్​) ఈఎస్‌ఎం , మహిళలు, దివ్యాంగులు, మైనారిటీలు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా అప్లై చేసుకోవాలి..

ముందుగాhttps://rrccr.com/ వెబ్​సైట్ ఓపెన్ చేయండి.
RRC CR Sports Quota Recruitment 2024 అప్లికేషన్ లింక్​పై క్లిక్ చేయండి.
వెబ్​సైట్​లో మీ వివరాలు టైప్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
యూజర్​ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ చేసుకోండి.
ఈ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వండి.
అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయండి.
అక్కడ అడిగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి
దరఖాస్తు రుసుం ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
అన్ని వివరాలు చెక్​ చేసుకొని అప్లికేషన్​ను సబ్ మిట్ చేయాలి.

విద్యార్హతలు, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 

Share post:

లేటెస్ట్