Job News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

Mana Enadu: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. SSC వార్షిక క్యాలెండర్ 2024-25 ప్రకారం ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పోస్టులకు డిసెంబర్ లేదా జనవరిలో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది. గతేడాది 46,617 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈసారి పెద్ద మొత్తంలో పోస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ పోస్టులకు 10వ తరగతి పాసైనవారు అర్హులు. వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు కలదు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
☛ వెబ్‌సైట్: https://ssc.nic.in/

 రైల్వేలో 1,376 పారామెడికల్ పోస్టులు

రైల్వేశాఖలోని వివిధ రీజియన్లలో ఉన్న ఖాళీగా ఉన్న 1,376 పారా మెడికల్ పోస్టులకు RRB దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోగలరు. పోస్టును అనుసరించి అభ్యర్థులు ఇంటర్, జీఎన్ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 100మార్కులను నిర్వహిస్తారు. ఇందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ(70మార్కులు), జనరల్ అవేర్‌నెస్(10మార్కులు), జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(10మార్కులు), జనరల్ సైన్స్(10మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
☛ వెబ్‌సైట్: https://indianrailways.gov.in/

జామ్-2025 నోటిఫికేషన్ విడుదల

ప్రతిష్ఠాత్మక IITల్లో పీజీలో ప్రవేశాలకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జామ్) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 11వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఒక పేపర్‌కి రూ.900, రెండు పేపర్లకు రూ.1250. మిగిలిన అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1800, రెండు పేపర్లకు రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 2, 2025న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్), ఎం. ఎస్(రిసెర్చ్), ఎమ్మెస్సీ-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ, జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ పేర్లతో ఐఐటీలు కోర్సులను అందిస్తున్నాయి. ఆసక్తిఉన్నవారు రెండు సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు.
☛ వెబ్‌సైట్: https://jam2025.iitd.ac.in/

Share post:

లేటెస్ట్