ManaEnadu:ఇప్పుడున్న జనరేషన్లో యువత.. అయితే సాఫ్ట్వేర్.. లేదా గవర్నమెంట్ జాబ్. ఈ రెండింటికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా మంది యువత ఏళ్లతరబడి ప్రయత్నిస్తుంటారు. ఒకసారి కాదు రెండు సార్లు ఐదారు సార్లు.. ఫెయిల్ అయినా.. మళ్లీ మళ్లీ పరీక్షలు రాస్తూనే ఉంటారు. సర్కార్ నౌకరీ వచ్చే వరకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఇలా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఎగ్జామ్ ఎలా రాస్తాం? ఈసారి క్వాలిఫై అవుతామా? అనే ప్రశ్నలతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఈ పది టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే మీకు జాబ్ గ్యారెంటీ. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..
టైమ్ టేబుల్ ప్లాన్ చేయాలి : ముందుగా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి. రోజువారీగా చదవాల్సిన సబ్జెక్టులు, టాపిక్‌లను డిసైడ్ చేసి పక్కనపెట్టుకోవాలి. ప్రతి సబ్జెక్టును కవర్ చేసేలా ప్లాన్ ఇండాలి.
చదివేందుకు అనువైన వాతావరణం క్రియేట్ చేయాలి : ఎక్కడపడితే అక్కడ కూర్చొని చదువుతామంటే కుదరదు. అలా చేస్తే కాసేపటికే బోర్ కొడుతుంది లేదా నిద్ర ముంచుకొస్తుంది. అందుకే మీకు ఏకాగ్రత కుదిరేందుకు మంచి గాలి, వెలుతురు వచ్చే ప్రశాంతాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా నిశబ్ధంగా ఉండే ప్రాంతంలో చదవాలి.
బ్రేక్ ముఖ్యం బిగులూ.. : చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో కచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. అలా చేస్తేనే మీరు చదవింది మీకు గుర్తుొంటుంది. బ్రేక్ లేకుండా చదివితే మెదడుపై ఒత్తిడి పడి త్వరగా మరిచిపోయే అవకాశం ఉంది. ఈ బ్రేక్‌లో మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా కాసేపు నడవడం వంటివి చేయాలి.
కంబైన్ స్టడీస్ బెస్ట్ : అప్పుడప్పుడు కంబైన్డ్ స్టడీస్ చేస్తే మీ సందేహాలు తీరడంతో పాటు మీకు తెలిసిన విషయాలు తోటి వారితో షేర్ చేసుకోవడం వల్ల ఎక్కువగా గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
సిలబస్ కంప్లీట్ : ఏదైనా విషయాన్ని పూర్తిగా నేర్చుకోవాలంటే క్షుణ్ణంగా చదివి సిలబస్ కంప్లీట్ చేయాలి. చదివేటప్పుడు షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవాలి. ఇది రివిజన్ టైమ్‌లో యూజ్ అవుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి : మంచి ఆహారపు అలవాట్లు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అసహజమైన నిద్ర, అలసట నుంచి తప్పించుకోవాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. శరీరం హైడ్రేట్‌గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగాలి. గింజలు, పెరుగు తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
కంటి నిండా నిద్ర ముఖ్యం : రోజూ హాయిగా నిద్రపోవాలి. కనీసం రోజుకు 8 గంటలు నిద్ర పోవాలి.
మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి : సిలబస్‌ను పూర్తి చేసిన తరువాత కచ్చితంగా మోడల్ పేపర్స్, పాత క్వశ్చన్ పేపర్స్ చూడాలి. వాటిని ప్రాక్టీస్ చేయాలి.
రివిజన్ చేయాలి : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు సిలబస్ మొత్తాన్ని కచ్చితంగా రివిజన్ చేయాలి. పరీక్షకు ఒక రోజు ముందు తప్పకుండా రివిజన్ చేయాలి. పరీక్ష సమయంలో కొత్తగా ఏం చదవకూడదు.
పరీక్ష నిబంధనలు ముందే తెలుసుకోవాలి : పరీక్షకు సమయం కంటే గంట ముందే వెళ్లాలి. హాల్ టికెట్లో ఇచ్చిన వివరాలను క్షుణ్ణంగా ఫాలో అవ్వాలి.