TS ICET 2024: విద్యార్థులకు అలర్ట్.. ఐసెట్ షెడ్యూల్ విడుదల

Mana Enadu: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2024 కోసం జారీ చేసిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) విడుదల చేసింది. MBA, MCA ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం తొలి విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. దీనిని క్లియర్ చేసిన విద్యార్థులు అధికారిక టీఎస్ ఐసెట్ వెబ్‌సైట్‌ (icet.tsche.ac.in)లో సందర్శించడం ద్వారా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని పేర్కొంది.

కౌన్సెలింగ్ షెడ్యూల్..

☞ ప్రాథమిక సమాచారం, ఆన్‌లైన్ ఫైల్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు SEP 1 నుంచి 8 వరకు
☞ స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ SEP 3 నుంచి 9 వరకు
☞ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎక్స్‌ర్‌సైజింగ్ ఆప్షన్లు SEP 4 నుంచి 11 వరకు
☞ ఆప్షన్ల ఫ్రీజింగ్ : SEP 11
☞ సీట్ల ప్రొవిజనల్ కేటాయింపు : SEP 14న లేదా అంతకు ముందు ఉండవచ్చు.
☞ వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చెల్లింపు : SEP 14 నుంచి 17 వరకు

 ఫైనల్ ఫేస్ ఇలా..

☞ సెప్టెంబర్ 20న ప్రాథమిక సమాచారం, ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అండ్ హెల్ప్ లైన్ సెంటర్ కోసం స్లాట్ బుకింగ్ మొదటి దశలో హాజరుకాని అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 21న జరుగుతుంది.
☞ ఎక్స్‌ర్‌సైజింగ్ ఆప్షన్లు : సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు
☞ ఆప్షన్ల ఫ్రీజింగ్ : సెప్టెంబర్ 22
☞ ప్రొవిజనల్ సీట్ కేటాయింపు : సెప్టెంబర్ 25న లేదా అంతకుముందు ఉండవచ్చు
☞ వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చెల్లింపు : సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు
☞ కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ : సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు
☞ స్పాట్ అడ్మిషన్లు (MBA, MCA ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలు) ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీలకు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు సెప్టెంబర్ 27న వెబ్‌సైట్ (tgicet.nic.in)లో అందుబాటులో ఉంటాయి.

 టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఇలా..

మొదట అధికారిక వెబ్‌సైట్ tgicet.nic.inకి వెళ్లాలి. తర్వత హోమ్‌పేజీలో “టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ 2024 కోసం రిజిస్టర్ చేసుకోండి” అనే లింక్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం పేమెంట్ పూర్తి చేసి, ఆపై సబ్మిట్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను సేవ్ చేసుకోవాలి. దానిరి భవిష్యత్ రిఫరెన్స్ కోసం ప్రింటౌట్ తీసుకోవడం మంచిది.

Related Posts

AI: ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు కోర్సులు పూర్తిగా ఉచితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్‌’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses)…

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *