Khammam| కాంగ్రెస్​ గొంతుక ‘జావేద్’​కు..సముచిత స్థానం ఇవ్వాల్సిందే!

ManaEnadu: బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ఖమ్మం జిల్లాలో ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచిన ఖమ్మం నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు మహమ్మద్​ జావేద్​కు సుమచిత స్థానం కల్పించాలని విద్యార్ధి, యువజన సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్​ పదవుల్లో జావేద్​ సేవలను గుర్తించకపోవడం బాధకరం అన్నారు.


జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా జావేద్ తనదైన శైలిలో ఉద్యమించారని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం కేసులు, బెదిరింపులకు వెనకడుగు వేయకుండా కార్యకర్తలకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. అసెంబ్లీ సీటు ఆశించినప్పటకీ రాబోయే కాలంలో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నాడు హమీనిచ్చారన్నారు. ఇప్పుడేమో నామినేటెడ్ పదవుల్లోనూ ఆయన సేవలు గుర్తించకపోవడం దారుణమని అన్నారు. పార్టీలో ఎప్పటి నుండో పని చేస్తూ పార్టీకే కట్టుబడి ఉన్న నాయకులను గుర్తించి వారికి సరైన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.లేదంటే కాంగ్రెస్ యువజన విద్యార్థి నాయకుల తరపున తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.

Related Posts

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

దసరా సెలవులు వచ్చేశాయ్.. ఇక పిల్లలకు పండగే

Mana Enadu : అప్పుడెప్పుడో సెప్టెంబరు నెల మొదటి వారంలో వర్షాలు (Rains) కురిసినప్పుడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరోజు వినాయక చవితికి, మరో రోజు గణేశ్ నిమజ్జనానికి (Ganesh Immersion) హాలిడేస్ ఇచ్చారు. ఇక అప్పటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *