Naresh Chitturi | Updated on: Mar 13, 2024 | 4:00 PM
Mana Enadu: రాజకీయంగా చైతన్యమైన ప్రాంతం..అది కమ్యూనిస్టుల కంచుకోట ఖిల్లా..తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి ప్రాణం పోసిన గడ్డ ఖమ్మం(Khammam) జిల్లా..ఖమ్మం పార్లమెంట్ స్థానంపై పోటీ పెరిగినా ప్రజలు మాత్రం ‘అమ్మ’ రావాలి..మార్పు తేవాలని కోరుకుంటున్నారు.
అమ్మ పౌండేషన్ ఖమ్మం జిల్లాలో ఈపేరు తెలియని వారు ఉండరు. గడిచిన 17ఏళ్లుగా ప్రత్యక్షంగా కాకపోయిన ప్రజలతోనే కలిసి నడిచిన వ్యక్తి ఆమె. మల్లు నందిని విక్రమార్క తాజాగా కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా రేసులో నిలబడటంతో ఒక్కసారిగా రాజకీయాల్లోకి తెరపైకి వచ్చారు.
ఇప్పటి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2007లో స్థానిక సంస్థల కోటాలా ఎమ్మెల్సీగా మధిర నియోజకవర్గ రాజకీయాల్లో క్రీయశీలకంగా వ్యవహరించారు. 2009లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క ఇప్పటి డిప్యూటీ సీఎం వరకు తిరుగులేని ప్రజానాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర రాజకీయాల్లో భట్టి విక్రమార్కంగా బీజీగా ఉన్నారు. ఈక్రమంలోనే రెండు దశాబ్ధాలుగా అమ్మ పౌండేషన్ స్థాపించి మల్లు నందిని(Mallu Nadhini) జనం అవసరాలు తెలుసుకుంటూ పరిష్కారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మధిర నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒక క్యాడర్‌ను సంపాదించుకున్నారు.
రేణుకాచౌదరిని ఖమ్మం ప్రజలు ఆడబిడ్డగా ఆశీర్వదించారు. మరి ఖమ్మం జిల్లా కోడలుగా మల్లు నందిని విక్రమార్కకు పార్లమెంటు అభ్యర్థిగా గెలుపించుకుంటామని రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతు పలుకుతున్నారు. మల్లు నందినికి టిక్కెట్ ఇవ్వాలని ఖమ్మం ఆడపడచులు రాహుల్‌గాంధీని కోరారు.
ఖమ్మంలో రెండు బలమైన సామాజిక వర్గాల పోరులో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రాజకీయాలకు అతీతంగా మల్లు నందిని ప్రజలతో సంబంధాలు కొనసాగించడంతో ఆమె గెలుపుకు తిరుగులేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.