‘వెనక నుంచి హగ్ చేసుకుని ముద్దు పెట్టాడు.. భరించలేక మాలీవుడ్ నుంచి చెన్నై వెళ్లిపోయాను’

ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ క్రమంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ మాలీవుడ్ నటి జాతీయ మీడియాకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. 

నలుగురు సహచర నటులు తనను లైంగికంగా వేధించారని, అసభ్యకరంగా దూషించారని ఆమె తెలిపారు.  ఓ సినిమా షూటింగ్ సమయంలో జయసూర్య అనే నటుడు తనను వేధింపులకు గురి చేశాడని వెల్లడించారు. తాను వాష్ రూమ్ కు వెళ్లి వస్తుండగా అతను వెనక నుంచి వచ్చి తనను హగ్ చేసుకుని ముద్దు పెట్టాడని చెప్పారు. తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని అన్నాడని పేర్కొన్నారు.

“మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్వత్వం గురించి అసోసియేషన్ సెక్రటరీ ఇడవేల బాబును సంప్రదిస్తే ఇంటికి రమ్మని చెప్పాడు. ఆయన నివాసానికి వెళితే శారీరకంగా వేధించాడు. నటుడు, సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం.ముకేశ్‌, మణియన్‌పిళ్ల రాజుపై కూడా నన్ను వేధించాడు. అన్నింటినీ తట్టుకుని సినిమా కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ వేధింపులు మితిమీరాయి. మలయాళం చిత్ర పరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారు. ఈ సంఘటన వల్ల నేను మానసికంగా ఎంతో కుంగిపోయాను. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వారు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించాలి.” అని సదరు నటి పేర్కొన్నారు.

ఈ నటి ఆరోపణలపై నటుడు మణియన్‌పిళ్ల రాజు స్పందిస్తూ.. ఆమె ఆరోపణల వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. కొంతమంది పరిస్థితులను వాడుకోవడానికి ప్రయత్నిస్తారని .. ఆమె ఆరోపించిన వ్యక్తుల్లో అమాయకులతో పాటు నిందితులు ఉంటారని పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *