Mana Enadu: మహిళల విషయంలో ఈ సమాజం కొన్ని ప్రమాణాల్ని నిర్దేశించింది. అలా ఉంటేనే అందం అంటూ తరతరాలుగా అందరి మనసుల్లో ముద్రించేశారు. దీంతో చాలామంది తాము అందంగా లేమని, లావున్నామని తమను తామే విమర్శించుకుంటారు. ఇతరులతో పోల్చుకొని కుంగిపోతుంటారు. ఈ పరిస్థితినే ‘ఫ్యాట్ ఫోబియా(Fatphobia)’ అంటారు. ఈ భయం మహిళల్ని శారీరకంగానే కాదు.. మానసికంగా, ఎమోషనల్(Emotional)గా దెబ్బతీస్తుందని, వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం తగ్గేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం
ఈ ఫోబియాకు గురైతే ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా.. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. అంతేకాదు.. ఏ పనీ చేయడానికి ఆసక్తి చూపరు. అధిక బరువుండడం వల్ల ఎందులోనూ సక్సెస్(Sucess) కాలేమని భయపడుతుంటారు. సన్నగా ఉన్న వారితో పోల్చితే తాము తెలివితేటల్లోనూ తక్కువేనని బాధపడే వారూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఏ సమస్య ఎదురైనా అధిక బరువు వల్లేనేమోనని నిందించుకుంటారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫొటోలు(Photos) తీసుకోవడానికి, అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడరు. ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ కాకపోయినా, ప్రేమ(Love) విఫలమైనా అన్నిటికీ ఇదే కారణంగా భావిస్తారు.
ఇలా బయటపడొచ్చు..
శరీరానికి గాయమైతే చికిత్స ఉంటుంది. కానీ మానసికంగా దెబ్బతింటే అది తగ్గించడం కాస్త కష్టంతో కూడుకున్న విషయం. ఇది కూడా అలాంటిదే.. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు సహజం.. ఈ విషయంలో రియలైజ్(Realise) అవుతూనే తమలో ఉన్న ప్రత్యేకతల్ని గుర్తించాలి. సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. అధిక బరువు విషయంలో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ల అనుభవాలు, సలహాలు, సూచనలు పొందొచ్చు.. ఇవీ ఫ్యాట్ ఫోబియా(Fatphobia)ను దూరం చేసేవే అంటున్నారు నిపుణులు. నిపుణుల సలహా మేరకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని డైట్(Deit)లో చేర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచే డార్క్ చాక్లెట్(Dark Chocolate), బెర్రీస్, ఓట్స్, నట్స్(Nuts), గింజలు, అవకాడో, అరటిపండు(Bananas).. వంటివి నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే పాజిటివిటీ పెరుగుతుంది. నెగటివిటీని పెంచే సోషల్ మీడియా(Social Media)కు దూరంగా ఉండాలి. మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫ్యాట్ ఫోబియాను దూరం చేసే థెరపీలూ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నిపుణుల ఆధ్వర్యంలో ఈ చికిత్సలు తీసుకోవడం వల్ల క్రమంగా ఉపశమనం లభిస్తుంది.