ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ సమరయోధుల సినిమాలు తప్పక చూడాల్సిందే!

ManaEnadu:ఎంతో మంది పోరాటయోధుల ప్రాణత్యాగ ఫలం 78 ఏళ్ల స్వతంత్ర భారతం. 200ఏళ్లకు పైగా బ్రిటీష్ పాలనపై ఎంతో మంది యోధులు తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించి స్వతంత్ర భారతావనిని మనకు ఇందించారు. అలా భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 78 వసంతాలు పూర్తయింది. ఈ స్వేచ్ఛ కోసం చేసిన సంగ్రామంలో ఎంతో మంది యోధులు, కళాకారులు ప్రాణాలర్పించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. స్వాతంత్య్ర పోరాటం, సమరయోధుల స్ఫూర్తితో టాలీవుడ్​లో తెరకెక్కిన కొన్ని సినిమాలు గురించి తెలుసుకుందాం. ప్రతి భారతీయుడు ఈ సినిమాలను తన జీవితంలో కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. మరి ఆ చిత్రాలు ఏంటంటే..?

అల్లూరి సీతారామరాజు
తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అంటూ స్వాతంత్ర్యం కోసం ఆంగ్ల దొరలపై నిప్పుల చెరిగిన తెలుగు వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు’ అని కృష్ణ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్.

సైరా నరసింహారెడ్డి
‘రేనాడు వీరులారా- చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ మెగాస్టార్ లీడ్​లో టాలీవుడ్​లో వచ్చిన మరో సినిమా సైరా నరసింహా రెడ్డి. స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి యుద్ధంలో వీరోచితంగా పోరాడిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటును కథాంశంగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు.

ఇద్దరు వీరుల కథ.. ఆర్ఆర్ఆర్
ఆంగ్లేయుల తూటాలకు ఎదురెళ్లిన అల్లూరి.. నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమరం భీమ్‌ స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్​గా జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయారు.
మహాత్మా గాంధీ జీవితకథ ఆధారంగా 1982లో రిచర్డ్‌ ఆటెన్‌బరో తెరకెక్కించిన ‘గాంధీ’ సినిమా ఏకంగా 8 ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే.
హిందీలో జాతీయోద్యమ కథలతో ‘ప్రేమ్‌కహానీ’ (1975), ‘క్రాంతి’ (1981), ఆమిర్‌ఖాన్‌ ‘లగాన్‌’, ‘మంగళ్‌పాండే’, ‘రంగ్‌ దే బసంతి’ వంటి సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *