Mana Enadu:బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 (Bigg Boss-8) షో ఆదివారం (సెప్టెంబరు 1వతేదీ 2024) గ్రాండ్‌గా ప్రారంభమైంది. 14 మంది కంటెస్టెంట్లు ఏడు జంటలుగా హౌజులోకి ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్ కంటే భిన్నంగా ఈ సీజన్ ఉంటుందని మొదటి నుంచి చెబుతున్నట్టే ఈ ఆట ఉండబోతోందని లాంఛింగ్ ఎపిసోడ్ (Bigg Boss Grand Launch) చూస్తేనే అర్థమైపోయింది. ఇక తొలి ఎపిసోడ్ ప్రోమో లేటెస్టుగా రిలీజ్ అయింది. ఈ ప్రోమో చూస్తుంటే మొదటి రోజే హౌజులో కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైనట్టు తెలుస్తోంది.
తాజాగా ప్రోమోలో ఆదివారం రోజు జరిగిన ఫేక్ ఎలిమినేషన్ (Bigg Boss Fake Elimination) గురించి నిఖిల్, నాగమణికంఠ మధ్య కాస్త వేడిగానే చర్చ జరిగినట్లు కనిపిస్తోంది. ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెబుతూ ఫైర్ అయ్యాడు మణికంఠ. “ఆయన బిహేవియర్‌లో, మాట్లాడే విధానంలో తేడా ఉంది. నేను అతన్ని లైక్ చేయను” అని కుండబద్దలు కొట్టినట్టు మణికంఠ చెప్పడం ప్రోమోలో చూడొచ్చు.
ఇక ఈ ప్రోమోలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. శేఖర్ బాషా (shekar Basha), సోనియా (Sonia) మధ్య రగడ. ఎప్పటిలాగే బిగ్‌బాస్ షో మార్నింగ్ ఓ మాంచి పాటతో కంటెస్టెంట్ల డ్యాన్స్‌తో షురూ అయింది. ఇక ఆ తర్వాత ఇంట్లోని కొందరు ఆట మొదలెట్టి నారింజ పండ్లతో కొట్టుకున్నారు. ఈ విషయంలో సోనియా ఆకుల తోటి కంటెస్టెంట్లపై కాస్త గట్టిగానే ఫైర్ అయింది. బిగ్ బాస్ రూల్స్ లో ఆరెంజ్‌తో ఆడొద్దని చెబుతూ శేఖర్ బాషా సోనియాపై విరుచుకుపడ్డాడు. “నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో.. కిందేసి తొక్కుకో.. డ్రైనేజ్‌లో వేసుకో.. అది మాత్రం వేరే వాళ్లకి పెట్టకు.. మనుషుల్లా తినాలనుకునే వాళ్లకి అవి పెట్టకు” అంటూ సోనియా కూడా కాస్త గట్టిగానే బదులిచ్చింది. శేఖర్ బాషా.. ఆ ఆరెంజ్‌లను తింటూ.. “ఆడిన వాటితోనే తిన్నా.. ఇప్పుడు నేను మనిషిని కాదా? పశువునా? అంటూ రచ్చ మొదలుపెట్టాడు.
ఆ తరువాత హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. 14 మందిలో ఆరుగురు కంటెస్టెంట్స్‌కి “పట్టుకునే ఉండండి (Bigg Boss First Task)” అంటూ తొలి టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌లో ముందుగా.. వివిధ రకాల కలర్లు ఉన్న బెల్ట్‌లను కంటెస్టెంట్స్ పట్టుకుని ఉండగా.. పక్కనే ఉన్న స్పిన్ తిప్పినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్‌ను బెల్ట్‌ను కట్ చేస్తుంటారు. అలా బెల్ట్‌లు కట్చేస్తున్నప్పుడు ఎవరూ కాలు కింద పెట్టకుండా ఉంటే వారు గెలిచినట్లు. కాలు కింద పెడితే ఓడినట్లు. అలా చివరి వరకు ఎవరుంటే వారే ఈ టాస్క్ విన్నర్. ఇక ఎవరు గెలిచారో చూడాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.