Indra|మెగా క్రేజా మజాకా.. హాట్ కేకుల్లా అమ్ముడైన ‘ఇంద్ర’ రీ రిలీజ్ టికెట్లు

ManaEnadu:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టిన రోజు (ఆగస్టు 22వ తేదీ) సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఓ క్లాసిక్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అదే ‘ఇంద్ర’ (Indra)సినిమా. ఈ మూవీ రీ రిలీజ్ కు భారీ సన్నాహాలు జరగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరు బర్త్ డే రోజున గ్రాండ్​గా విడుదల చేసేందుకు వైజయంతీ మూవీస్ సంస్థ ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా మొదలైనట్లు సమాచారం. వీకెండ్ మూడ్ లో ఉన్న చిరు ఫ్యాన్స్ జోరుగా ఈ సినిమా టికెట్లు బుకింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల హౌస్ ​ఫుల్​ బోర్డ్స్​ పెట్టేంతలా బుక్కింగ్స్ అయ్యాయట. కొన్ని చోట్ల క్షణాల్లోనే టిక్కెట్లు అమ్మడుపోతున్నాయని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ కూడా సోల్డవుట్ అయినట్లు తెలిసింది.

 కేవలం 24 గంటల్లోనే దాదాపు 12 వేలకు పైగా టికెట్లు సేల్ జరిగినట్లు ట్రేడ్​ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ బుకింగ్స్‌తోనే దాదాపు రూ. కోటి గ్రాస్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నిర్మాణ సంస్థ కూడా పలు చోట్ల మరిన్నీ షోస్ యాడ్ చేస్తామని అధికారికంగా ప్రకటించడం వల్ల ఈ చిత్రానికి మరింత హైప్​ పెరిగిందని అంటున్నారు.

మొత్తానికి ఈ ఆగస్టు 22వ తేదీన థియేటర్లలో మెగా క్రేజ్ కనిపించబోతోంది. వీరశంకర్ రెడ్డి.. పాత సినిమానే కదా అని లైట్ తీసుకుంటే.. బుకింగ్స్ తో రెచ్చిపోతామంటూ చిరంజీవి ఫ్యాన్స్ డైలాగ్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 

ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆ మూవీలోని కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ .. 

వీరశంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా 
సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది. 
రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడలే కానీ ఆశ్చర్యపోతారేంటీ.. రాననుకున్నారా రాలేననుకున్నారా
షౌకత్ అలీఖాన్.. తప్పు నావైపుంది కాబట్టి తలంచుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. 
ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందంతో పులకరిస్తుందో.. ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గార్గించి వర్షిస్తాయో.. ఎవరి పేరు చెప్తే బంజారా భూములు పంట పొలాలుగా మారతాయో .. ఆయనే ఈ ఇంద్రసేనా రెడ్డి

Share post:

లేటెస్ట్