ManaEnadu:రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శనివారం రోజున లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ భామ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంది. చీరకట్టులో ఇమాన్వీ చాలా అందంగా కనిపించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ బ్యూటీ గురించే చర్చ జరుగుతోంది. అసలు ఇమాన్వీ ఎవరంటూ నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్న యువతకు ఇమాన్వీ సుపరిచతమే. రీల్స్, డ్యాన్స్‌తో దాదాపు 7లక్షల మంది ఫాలోవర్లున్ననారు ఈ బ్యూటీకి. 1995 అక్టోబర్ 20న దిల్లీలో పుట్టిన ఇమాన్ ఇస్మాయిల్ కు.. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. డ్యాన్స్ నేర్చుకుంటూనే ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత జాబ్ రిజైన్ చేసి, యూట్యూబ్ ఛానల్ ప్రారంభించించింది. ఫుల్ టైమ్ డ్యాన్స్, ఈవెంట్స్, డ్యాన్స్ షోలపై దృష్టి పెట్టి నెమ్మదిగా క్రేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ గా పాపులర్ కావడంతో ఈ భామకు ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది.
ఇక ఈ భామకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలనే ఆలోచన రాగానే తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేశారట. జాబ్ వదిలేసినప్పుడు కూడా ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్. అండగా ఉంటాం’ అని ఇమాన్ వాళ్ల నాన్న ప్రోత్సహించారట. దీంతో ఫుల్ టైమ్ డ్యాన్స్, ఈవెంట్స్, డ్యాన్స్ షోలపై దృష్టి పెట్టి నెమ్మదిగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్‌తో ఛాన్స్ రావడంతో అమె త్వరలోనే మిలియన్ ఫాలోవర్స్ మార్క్ క్రాస్ చేయడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. ఇక పూజా కార్యక్రమంలో ఈ భామను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ నెక్స్ట్ క్రష్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ షురూ చేశారు.