Mana Enadu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా విడుదలకు ముందు మాంచీ బజ్ క్రియేట్ చేసుకుంది. అటు ప్రమోషన్లలోనూ విపరీతమైన హైప్ సంపాదించుకుంది. వీటన్నింటికీ తోడు సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షలను బాగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 14న ప్రీమియర్స్ పడగా..15న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ముఖ్యంగా ట్రైలర్‌లో రవితేజ డైలాగ్స్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోవడంతో రవితేజ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరిందని అంతా భావించారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ల నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. చివరికి వీకెండ్స్ కూడా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు.
కారణం ఎవరు..
అయితే రవితేజ తాజా మూవీ డిజాస్టర్‌కు కారణం ఏంటనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. కానీ, ఈ సినిమా ఫెయిల్యూర్‌కు డైరెక్టర్ హరీశ్ శంకర్ కారణం అంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. అయితే దీనికి అసలు రీజన్ ఎవరు.. ఎక్కడ పొరపాటు జరిగింది. ఎవరూ కావాలని సినిమా ఫెయిల్యూర్ చేసుకోరు కదా.. ఎక్కడ తప్పు ఉంది. అంటే రవితేజ వైపు నుంచే సమస్య అంటున్నారు మరి కొందరు. మొదట రవితేజ తన ప్రయారిటీస్ మార్చుకోబట్టే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని ఈ మాస్ హీరో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారట. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వరకు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ రెండో రోజు కేవలం ఎనభై లక్షలు మాత్రమే కలెక్షన్స్ దక్కించుకొని డిసపాయింట్ చేసింది. దీంతోపాటు డే బైడే కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి.
ఆ ధోరణే రవితేజను ముంచేస్తోందా..
ఇదిలా ఉంటే రవితేజ గత నాలుగు సినిమాల్లో ఒకే ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రవితేజ పీపుల్స్ మీడియా వారికి నాలుగు సినిమాలు 100కోట్లకు చేస్తానని అగ్రిమెంట్ చేసి అందులో భాగంగా టైగర్ నాగేశ్వరరావు, ధమాకా, ఈగల్, మిస్టర్ బచ్చన్ చేశారని, దాని ప్రకారం ఇంకో మూవీ పెండింగ్ ఉందని తెలుస్తోంది. అలా ముందు తన పేమెంట్ సెట్ అయితే డేట్స్ ఇచ్చేద్దామనే ధోరణే రవితేజని ముంచేస్తోందని సినీ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వినిపిస్తోంది. మరోవైపు రవితేజలోనూ మునపటి జోష్ తగ్గిందని కొందరు అంటున్నారు. అయితే సినిమా పరిశ్రమలో హిట్‌లు, ఫ్లాపుల కామన్. సక్సెస్ వస్తే అన్నీ మర్చిపోయి ప్రొడ్యూసర్స్ ఇంటి ముందు క్యూ కడతారు. మరి రవితేజకు అలాంటి రోజులు త్వరలోనే వస్తాయని ఆయన అభిమానులు అంటున్నారు.