ManaEnadu:సలార్, కల్కి సినిమాల సక్సెస్ జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులైప ఫోకస్ పెట్టాడు. ఓవైపు సలార్-2, కల్కి పార్ట్ -2 సినిమాలు తన చేతిలో ఉండగానే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ లకు ఓకే చెప్పాడు. ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ జరుగుతోంది. ఇంకా స్పిరిట్ కు సంబంధించి అప్డేట్స్ మాత్రం రాలేదు. అయితే ఇవన్నీ ప్రాజెక్టులు తన చేతిలో ఉండగానే ప్రభాస్.. డైరెక్టర్ హను రాఘవపూడి సినిమాను ఓకే చేశాడు.
దాదాపు నాలుగైదు ప్రాజెక్టులు చేతిలో ఉండగా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కుతుందా అని అందరూ అనుమానపడ్డారు. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తాజాగా ఈ ఇద్దరి కాంబోలో రానున్న సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో వస్తున్న చిత్రాన్ని హైదరాబాద్ లో ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు.
పూజా కార్యక్రమాలతో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ కూడా వచ్చాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ పూజకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ప్రభాస్ మూవీకి సంబంధించి ఓ కొత్త అప్డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.
పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు టాక్ కూడా నడిచింది. అయితే అదంతా ఫేక్ అని ఈ బ్యూటీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. మరి ప్రభాస్ సరసన ఈ సినిమాలో ఎవరు నటిస్తారోనని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…