ManaEnadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బీ టౌన్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటానీ, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్లలోనూ ప్రభాస్ మూవీ దూసుకెళ్లి ఆయనకు మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.
అయితే కల్కి మూవీ రిలీజ్ అయి 50 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కూడా జరిపారు. ఈ వేడుకలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాజరై సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే 50 రోజులు పూర్తైన సందర్భంగా కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. గత కొంతకాలంగా కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నా.. మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజా ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్య కథతో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ నాగ్ సృష్టించిన ప్రపంచంలో.. అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలించే సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసి కాంప్లెక్స్ తీసుకెళ్తుంటారు.
ఆ అమ్మాయిల్లో సుమతి (దీపిక) కూడా ఉంటుంది. రేపటి కోసం అంటూ ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తున్న శంబల ప్రజలు ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. అయితే సుమతి కాంప్లెక్స్ నుంచి పరార్ అవుతుంది. ఆమెకు సాయం చేసింది ఎవరు.. భైరవ (ప్రభాస్) సుమతిని మళ్లీ కాంప్లెక్స్ కు ఎందుకు చేర్చాలనుకుంటాడు.. అశ్వత్థామకీ, భైరవకీ సంబంధం ఏంటి? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ – కె లక్ష్యమేంటో ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. దీనికి పార్ట్-2 కూడా ఉందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.