Mana Enadu: బాలీవుడ్ బాద్ షా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిల్వర్ స్క్రీన్‌తోపాటు బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ఈ మెగా హీరో ఇటీవల ప్రభాస్ కల్కి మూవీలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది. అమితాబ్‌కు వెండితెర అభిమానులు ఎంత మంది ఉన్నారో… అదే రేంజ్‌లో బుల్లితెర ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఆయన చాలా కాలంగా కౌన్ బనేగా కరోడ్ పతి అనే క్విజ్ రియాల్టీ షో అలరిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ షో నిర్వహిస్తున్న ఆయన 16వ సీజన్‌కీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
అయితే ‘కౌన్ బనేగా కరోడ్ పతి(Koun Banega Crorepati)’ కార్యక్రమానికి ఒక్కో ఎపిసోడ్‌కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా 15వ సీజన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 3 నుంచి రూ.4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజా 16వ సీజన్‌కు అమితాబ్ భారీ మొత్తంలోనే తీసుకుంటున్నారట. అయితే ఇది అఫీషియల్‌గా మాత్రం ఎక్కడా బయటికి రాలేదు.
గతంలో ఎంత తీసుకున్నారంటే..
KBC తొలి రెండు సీజన్లకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 25 లక్షలు తీసుకున్న బిగ్, KBC4,5 సీజన్లకి రూ.50 లక్షలు, KBC6, 7 సీజన్లకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్నారట. ఇక KBC8కి రూ. 2 కోట్లు, KBC9కి రూ. 2. 9కోట్లు, KBC10 రూ.3 కోట్లు, KBC 11,12,13 సీజన్లకు రూ. 3.5 కోట్లు చొప్పున అందుకున్నారట. ఇక KBC14,15సీజన్లకి రూ. 4 నుంచి రూ.5 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకున్నారట. తాజా KBC16 సీజన్ ఒక్కో ఎపిసోడ్‌కి ఆయన రూ. 5 కోట్లు పొందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ షో 16 సీజన్ సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ సమయంలో బిగ్ బి ఉద్వేగానికి లోనయ్యారు. KBCలో తన ప్రయాణాన్ని వీక్షించి.. అతనికి మద్దతు ఇచ్చిన వారందరికీ ఆయన ఓ సందేశం కూడా అందించారు.







