ManaEnadu:ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయంం కానున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ అవ్వబోతున్నాడు.
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు (Ramesh Babu) తనయుడు జయకృష్ణ (Jaya Krishna) ఘట్టమనేని త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కానున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా జయకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో షూట్ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ లో సందడి చేశారు. అక్కడ బ్లాక్‌సూట్‌లో మెస్మరైజింగ్‌లో లుక్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
జయకృష్ణ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి, డాన్స్ తదితర అంశాలపై పట్టు సాధిస్తున్నారు. తాతయ్య కృష్ణ, తండ్రి రమేష్‌బాబు, బాబాయ్ మహేష్‌బాబు (mahesh babu) చరిష్మాను కొనసాగించడానికి, హీరోయిక్ క్వాలిటీస్ అన్నింటి మీద పరిపూర్ణంగా పట్టు సాధించి ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడట. ఇప్పటికే జయకృష్ణ కొన్ని స్టోరీ లైన్స్ విన్నారని తెలిసింది. త్వరలోనే తెలుగులో పేరొందిన దర్శకుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేయబోతున్నారని తెలిసింది.