ManaEnadu:నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ టాక్ షోకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య సందడి, మాట తీరు, యాంకరింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ షోతో ఆయనలో మరో కోణం ప్రేక్షకులకు చేరువైంది. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్టులతో ఆయన కలిసిపోయే తీరు, మాట్లాడే తీరు, వాళ్ల నుంచి సీక్రెట్లు బయటు తెప్పించడం వంటివి ఆడియెన్స్‌కు బాగా నచ్చాయి. యంగ్ హీరోలతో తాను యువకుడై బాలయ్య బాబు చేసే సందడికి ప్రేక్షకులు ముచ్చట పడిపోయారు.
అయితే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో కొత్త సీజన్ కోసం రంగం సిద్ధం చేస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయట. మూడు సీజన్ల మాదిరి ఈ కొత్త సీజన్‌ను సరికొత్త సర్‌ప్రైజ్‌లతో ఆహా టీమ్ ప్రజెంట్ చేయనుందట. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, చివరకు రాజకీయ నేత ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ షోలో సందడి చేశారు.
అయితే గత సీజన్లో బాలయ్య షోకు మెగాస్టార్ చిరంజీవి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన రాలేదు. అయితే సరికొత్తగా రాబోయే నాలుగో సీజన్లో చిరు అడుగుపెట్టనున్నట్లు టాక్. దీనిపై చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. టాలీవుడ్లో బాలయ్య, చిరులది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా ఈ ఇద్దరు హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ప్రతి సీజన్లో ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఇద్దరి సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటాయి. అలాంటి ఇద్దరు అగ్రహీరోలు ఒక చోట కలిస్తే.. ఉంటుంది మాస్ జాతరే ఇక. అయితే చిరుతో పాటు నాగార్జున కూడా కలిసి ఈసారి షోలో పాల్గొననున్నట్లు టాక్.






