Mr Bachchan|మిస్టర్‌ బచ్చన్‌’ రన్‌టైమ్‌ తగ్గింపు.. ఎందుకంటే?

ManaEnadu:‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ తర్వాత రవితేజ హీరోగా హరీశ్‌ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది.

మిస్టర్ బచ్చన్ సినిమా రన్ టైమ్ తగ్గించినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని 13 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు మరింత రేసీగా.. ఎంగేజింగ్ గా సినిమా ఉంటుందని చిత్ర బృందం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో పేర్కొంది. 

మరోవైపు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంపై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించారు. ఇలాంటి ఫీడ్ బ్యాక్ తనకు కొత్తేం కాదని చెప్పుకొచ్చారు. తనకు నచ్చినట్టు రివ్యూలు ఇవ్వాలని తాను ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. తన సినిమా అందరికీ నచ్చాలనుకోవడం దురాశే అవుతుందని తెలిపారు. అయితే ప్రతి షోకు పాజిటివ్‌ టాక్‌ పెరుగుతోందని .. టీమ్‌ అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకుల ఆదరణ ఉందని వెల్లడించారు.

మాస్ సినిమా కాబట్టి బీ, సీ సెంటర్లలో రెస్పాన్స్‌ బాగుందని.. కథ డిమాండ్‌ మేరకే సిద్ధు జొన్నలగడ్డను అతిథి పాత్రకు ఎంపిక చేశామని తెలిపారు. అతడి ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్లందని చాలామంది అంటున్నారని చెప్పారు. తన తండ్రికి, తనకు మధ్య జరిగిన చర్చల ఆధారంగానే హీరో- అతడి తండ్రి మధ్య సీక్వెన్స్‌ రాశానని వెల్లడించారు. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *