Thangalaan|తంగలాన్‌’ సీక్వెల్‌.. ఫ్యాన్స్ కు చియాన్ విక్రమ్ గుడ్ న్యూస్

ManaEnadu:భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలు చేసే హీరోల్లో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ముందుంటారు. మూస ధోరణిలో తన సినిమాలు ఉండకుండా.. డిఫరెంట్ జానర్ లో.. వెరైటీ కథచిత్రాలతో ఆయన ప్రేక్షకులను ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుంటారు. ముఖ్యంగా ప్రయోగాత్మక పాత్రలకు విక్రమ్ కేరాఫ్ అడ్రస్. తన పాత్ర కోసం తనను తాను ఎంత మార్చుకుంటారో ఐ వంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. 

ఇలా ప్రయోగాలు చేసే విక్రమ్.. సామాజిక సమస్యల ఇతివృత్తాలను కథాంశంగా ఎంచుకునే డైరెక్టర్ పా.రంజిత్ కాంబోలో తెరకెక్కిన మూవీ తంగలాన్. ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. ఈ సినిమా మొదటి నుంచి ఇస్తున్న అప్డేట్స్ తో ఈ మూవీ కోసం విక్రమ్ తనను తాను ఎలా మార్చుకున్నారో చూసి ప్రేక్షకులు ఆయన కమిట్ మెంట్ కు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సినిమా గ్లింప్స్, ట్రైలర్ చూసి తంగలాన్ ప్రపంచాన్ని చూడాలని ఉవ్విళ్లూరారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15ల తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగానే సినిమా హాళ్లకు క్యూ కట్టారు ప్రేక్షకులు. 

ఇక ప్రేక్షకుల రియాక్షన్ చూసి తాను అమితానందంలో ఉన్నానని విక్రమ్‌ అన్నాడు. తంగలాన్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఆయన సంతోషంలో మునిగిపోయాడు. ఆయన నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’  నాలుగు విభాగాల్లో జాతీయ పురస్కారాలకు ఎంపికవడంతో ఫుల్ జోష్ లో ఉన్న విక్రమ్.. తన అభిమానులకు ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు.  ‘తంగలాన్‌’ కు సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించారు. పార్ట్‌ – 2 గురించి దర్శక- నిర్మాతలతో ఇంతకుముందే చర్చించానని, వీలైనంత త్వరలోనే ప్రారంభిస్తామని అసలు సంగతి చెప్పుకొచ్చాడు. ఈ న్యూస్ తో విక్రమ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

 

Share post:

లేటెస్ట్