Natural Star Nani: ‘సరిపోదా శనివారం’ ఇప్పటికైతే సరిపొదు

ManaEnadu:నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. చిత్ర ఘన విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

వివేక్ విషయంలో చాలా ప్రౌడ్‌గా వుంది. ‘అంటే సుందరానికీ’ రావాల్సిన బాక్సాఫీసు సక్సెస్ రాలేదనే చిన్న వెలితి వుండేది. అది కాస్త ఈ సినిమాతో బ్యాలెన్స్ అయిపొయింది. దానయ్య గారితో రెండో సినిమా ఇది. ‘నిన్ను కోరి’ చాలా స్పెషల్ మూవీ.

ఇప్పుడు ‘సరిపోదా శనివారం’. నెక్స్ట్ టైం సినిమా చేసినప్పుడు అంచనాలు ఎక్కువగా వుంటాయి. అలాంటి సెటప్పే చేద్దాం. గట్టిగా కొడదాం. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. సెప్టెంబర్ 5న ‘సరిపోదా శనివారం’ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ వుంటుంది. ఈ శనివారంతో సరిపోదు నెక్స్ట్ శనివారం..నెక్స్ట్ శనివారం అలా వెళుతూనే వుంటుంది. థాంక్యూ ఆల్.. అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. 15 రోజులుగా టీంలో ఎవరికీ నిద్రలేదు. అప్పుడు పని చేసే ఒత్తిడితో నిద్ర లేదు. ఈ మూడు రోజులు‌గా సక్సెస్ ఎక్సయిట్‌మెంట్‌తో నిద్రలేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రసంశలు వస్తున్నాయి. సినిమాని మీరంతా ఆదరిస్తారని తెలుసు. థియేటర్‌లో అందరితో కలిసి ఆడియన్స్ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువగా అంచనా వేశామనిపించింది. సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని మరోసారి ప్రూవ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంత వర్షంలో కూడా అన్నీ చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే వి హేవ్ గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ది వరల్డ్. ఆడియన్స్ అందరికీ థాంక్స్. మా టీం అందరి తరపున ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పడానికి కలిశాం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *