Police Vaari Hecharika: పొస్టర్​ చూస్తేనే..కథలో ఆసక్తి కనిపిస్తుంది..హిరో శ్రీకాంత్​

ManaEnadu:దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలిక తనిష్క్ క్రియేషన్స్(Thoolika Thanishk Creations) పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న “పోలీస్ వారి హెచ్చరిక”(Police Vaari Hecharika) చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ తన నివాసం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “టైటిల్ ఎంత ఆకర్షణీయం గా ఉందో.. ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందన్నారు. ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారని, కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక పోలీస్ ను తుపాకులతో కట్టి బంధించడం నిజంగా కొత్తగా ఉందని పేర్కొన్నారు . ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నమ్మకం ఉందని” ఉద్ఘాటించారు.

నిర్మాత బెల్లి జనార్థన్(Belli Janarthan) మాట్లాడుతూ “ఎప్పటికైనా హీరో శ్రీకాంత్ తో ఒక ఫోటో దిగాలనుకున్నానని, అటువంటిది నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నే ఆయన ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో కూడా హీరో శ్రీకాంత్ మా సినిమా నుండి క్యారెక్టర్లు చేస్తూ ఎంతగానో సహాయపడ్డారు” అన్నారు.

ఈ కార్యక్రమం లో చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తారాగణం :
సన్నీ అఖిల్ , గిడ్డేష్ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , హిమజ , జయ వాహిని , మేఘనా ఖుషి , శంకరాభరణం తులసి తదితరులు ఉన్నారు.

Share post:

లేటెస్ట్