హార్దిక్ – నటాషా విడాకులకు అదే కారణమట!

ManaEnadu:టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య.. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ ప్రకటన అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశమైన సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే ఈ జంట విడాకులకు కారణం మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. కొందరు హార్దిక్ చీట్ చేశాడని అంటుంటే.. మరికొందరు నటాషాదే తప్పు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా వీరి విడాకులకు గల కారణాన్ని నటాషా సన్నిహితులు మీడియాకు వెల్లడించినట్లు బీ టౌన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ కారణం ఏంటంటే..?

హార్దిక్ వ్యక్తిత్వంతో నటాషా విసిగిపోయిందని, అందుకే వీరు విడాకులు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు తెలిసింది. “పెళ్లి తర్వాత హార్దిక్, నటాషా కొంతకాలం హ్యాపీగానే ఉన్నారు. అయితే కొన్నిరోజుల తర్వాత ఇద్దరి మధ్య వ్యక్తిత్వపరంగా చాలా తేడాలున్నట్లు నటాషా గుర్తించింది. హార్దిక్ ఎప్పుడూ తన గురించే ఎక్కువగా ఆలోచించే వ్యక్తిత్వం కలిగి ఉండేవాడు. అయినా హార్దిక్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ఉండేందుకు నటాషా చాలా ట్రై చేసింది. తనకు అసౌకర్యంగా అనిపించినా.. ఈ రిలేషన్ షిప్ ను కాపాడుకోవడానికి ఆమె ప్రయత్నించింది.”

“కానీ, అది హార్దిక్ అర్థం చేసుకోలేకపోయాడు. ఇక ఇలానే అతడితో ఉండలేక ఒక అడుగు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకోవాలనుకుంది. అయితే ఇది కేవలం ఒక్క రోజులోనో లేదా వారంలో తీసుకున్న నిర్ణయం కాదు. దీని గురించి ఆమె చాలా నెలలపాటు ఆలోచించింది. తనకు సహించే ఓపిక ఉన్నంత వరకు ఆ బంధంలో ఉండటానికి ప్రయత్నించింది. కానీ ఎంత చేసినా హార్దిక్‌ మారకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ గాయం ఇంకా ఆమెను బాధిస్తూనే ఉంది’’ అని సంబంధిత వర్గాలు తెలిపినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇక 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో పాండ్యా.. సెర్బియా నటి అయిన నటాషా చేతికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ లో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించింది. 2020 జులైలో నటాషా పండంటి మగబిడ్డ (అగస్త్య)కు జన్మనిచ్చింది. 2023 ఫిబ్రవరి 14న హార్దిక్‌, నటాషా రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్‌ పద్ధతుల్లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. ఈ ఏడాది వారు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం అనంతరం నటాషా కుమారుడు అగస్త్యను తీసుకొని సెర్బియాకు వెళ్లిపోయింది.

Share post:

లేటెస్ట్