బిగ్‌బాస్‌ సీజన్ 8 హోస్ట్‌గా విజయ్‌ సేతుపతి.. అద్దిరిపోలా?

ManaEnadu:ఇండియన్ రియాల్టీ షోలల్లో బిగ్​బాస్​ ది ప్రత్యేకమైన స్థానం. ఈ షో చాలామందికి నచ్చుతుంది. కొందరికి నచ్చకపోయినా సరే చూస్తారు. అదే ఈ షో స్పెషాలిటీ. ఆ హౌస్​లో ఏం జరుగుతుందనే దానిపై ఆఫీసులో టీ బ్రేక్​లో చర్చలు కూడా నడుస్తుంటాయి. కంటెస్టెంట్స్​కు సపోర్టు చేసేందుకు గ్రూపులుగా కూడా డివైడ్ అవుతారు. అలా బిగ్​బాస్ షో ఇండియాలో బాగా పాపులర్ అయింది. మొదట్లో కేవలం హిందీలోనే ఉండే ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా తీసుకువచ్చారు. అలా తమిళంలో చాలా ఏళ్ల నుంచి ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో నడుస్తోంది.

గత ఏడు సీజన్లకు తమిళ్​లో బిగ్ బాస్ హోస్టుగా విశ్వనటుడు కమల్ హాసన్ వ్యవహరించారు. అయితే ప్రస్తుతం సీజన్-8 త్వరలో వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఈ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ సీజన్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న సమయంలో కమల్ హాసన్ ఓ షాక్ ఇచ్చారు. రానున్న సీజన్​లో తాను హోస్టుగా చేయడం లేదని చెప్పారు. తనకు ముందుగానే ఉన్న వర్క్ కమిట్​మెంట్స్ వల్ల చేయలేక పోతున్నానని తెలిపారు.

కమల్ హాసన్ హోస్టుగా తప్పుకున్న తర్వాత తమిళ్ బిగ్ బాస్-8కు నెక్స్ట్ హోస్టు ఎవరేదానిపై తెగ చర్చ జరుగుతోంది. మొదట నటుడు శింబు పేరు తెరమీదకు వచ్చింది. ఏమైందో ఏమో.. తాజాగా ఉన్నట్టుండి ఆ స్థానంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోంది. బిగ్​బాస్ సీజన్-8కు విజయ్ సేతుపతి హోస్టుగా రానున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ హీరోకు నటనలో ఉన్న వర్సటాలిటీ గురించి తెలిసిందే. ఇక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఔరాను చూశాం. ఇప్పటికే తమిళ్​లో ‘మాస్టర్‌ చెఫ్‌’తో పాటు మరో ప్రోగ్రామ్​కు ఆయన హోస్టుగా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బిగ్​బాగ్ స్టేజ్​పైనా ఆయన రప్ఫాడించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *