అజిత్’​లా మీకు ఫాలోయింగ్ లేదుగా?.. రిపోర్టర్ ప్రశ్నకు చియాన్ విక్రమ్ దిమ్మదిరిగే ఆన్సర్

ManaEnadu:చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో మాళవిక మోహనన్ హీరోయిన్​గా నటించిన లేటెస్ట్​ మూవీ తంగలాన్. హిస్టరికల్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించాడు. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్​లో బిజీబిజీగా ఉంది. ఇందులో భాగంగానే సినిమా యూనిట్ మధురైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.

ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ విక్రమ్​ను ఉద్దేశించి.. “మీకు అజిత్, సూర్యలాగా పాపులారిటీ లేదు కదా. మరి మీకు ఆ రేంజ్‌లో అభిమానులు ఉంటారా? అని ప్రశ్నించగా తంగలాన్ టీమ్ షాక్ అయింది. కానీ రిపోర్టర్ ప్రశ్నకు చియాన్ విక్రమ్ ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘బహుషా నా ఫ్యాన్స్ గురించి మీకు తెలియకపోవచ్చు. ఒక్కసారి తంగలాన్ రిలీజ్ రోజు థియేటర్​కు వచ్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది చియాన్ ఫ్యాన్స్ గురించి” అని కూల్​గా కౌంటర్ ఇచ్చాడు.

అంతటితో ఆగకుండా మరో రిపోర్టర్ కోలీవుడ్​లో టాప్-3 లీడింగ్ హీరోలకు ఉండే పాపులారిటీ కూడా మీకు లేదు కదా అని ప్రశ్నించగా.. విక్రమ్ నవ్వుతూ.. “టాప్ హీరోనా కాదా అనేది మ్యాటర్ కాదు. ఆడియెన్స్​కు కనెక్ట్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. ధూల్, సామీ సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో వాళ్ల మనసు గెలిచే సినిమాలేంటో నాకర్థమైపోయింది. ఇక తంగలాన్ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. నా ఫ్యాన్స్​కు నచ్చేలా నటించాను. ప్రతి ఒక్కరికీ వాళ్ల అభిమానులు వాళ్లకు ఉంటారు. అని విక్రమ్ సమాధానం ఇచ్చాడు. అప్పుడే మరో రిపోర్టర్ కలిగించుకుని మిగతా హీరోలకు ఫ్యాన్స్‌తో పాటు ద్వేషించే వాళ్లు ఉంటారు, కానీ విక్రమ్‌ను ద్వేషించే వాళ్లు ఉండరని అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.

 

Share post:

లేటెస్ట్