Bigboss8|తాజా కబర్.. బిగ్​ బాస్​ హౌస్ లోకి టాలీవుడ్ హీరో!

ManaEnadu:గతేడాది ఉల్టా పుల్టా అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్.. ఈసారి ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదంటూ త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీన తెలుగు బిగ్ బాస్ సీజన్-8 ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే సీజన్-8కు సంబంధించి ప్రోమోలు విడుదలై ఈసారి షోపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. గతేడాది లాగే ఈ ఏడాది బిగ్ బాస్(BigBoss Telugu) షోకు నాగార్జున హోస్టుగా వ్యవహరించనున్నారు.

అయితే ఈ షోకు సంబంధించి నెట్టింట వివిధ రకాల న్యూస్ వైరల్ అవుతోంది. అందులో ముఖ్యంగా ఈ సీజన్ లో ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టుల లిస్టు ఆసక్తికరంగా మారింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ నుంచి ఓ హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరంటే.. 

బిగ్​బాస్​ సీజన్​ 8లోకి ఎంట్రీ ఇచ్చేది వీళ్లే అంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లిస్టులో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్న ఓ పేరు టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం. మస్తు షేడ్స్ ఉన్నయ్ రా నీలో అంటూ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు అభినవ్. తన కామెడీ టైమింగ్ తో వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఈ నటుడి పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా తర్వాత అభినవ్ టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయాడు.

ఏకంగా కమెడియన్ నుంచి హీరోగా మారాడు. ఇటీవలే మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా అంటూ తన డైలాగ్ తోనే ఓ సినిమాలో హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చేందుకు వస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక అభినవ్ తో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి నయని పావని, వింధ్య విశాఖ, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, రీతూ చౌదరి, కుమారీ ఆంటీ, బర్రెలక్క, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ, నటి సోనియా సింగ్, హీరోయిన్ కుషితా కల్లపు, సురేఖ వాణితోపాటు ఆమె కూతురు సుప్రిత ఈ సీజన్ లో సందడి చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *