ManaEnadu: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందని అన్నాడు. ఇప్పుడు అర్షద్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్షద్.. తాను ‘కల్కి’ సినిమా చూశానని కానీ తనకు నచ్చలేదని చెప్పాడు.
ఇక ఆ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో హీరో ప్రభాస్ కాకుండా అమితాబ్ బచ్చన్ పాత్ర ఎక్కువగా హైలైట్ అయిందని అన్నాడు. అశ్వత్థామతో పోలిస్తే, ప్రభాస్ నటించిన భైరవ పాత్ర తేలిపోయిందని చెప్పాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రభాస్ ను తెరపైకి చూసి నాకు బాధ కలిగింది. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది ప్రభాస్. కానీ ఆయన పాత్రకు సంబంధించిన లుక్ జోకర్ లా ఉంది. ప్రభాస్.. మ్యాడ్ మ్యాక్స్ తరహా మూవీలో నటిస్తే చూడాలని ఉంది. మెల్ గిబ్సన్ లా నిన్ను చూడాలని ఉంది ప్రభాస్. కానీ మీరెందుకు ఇలాంటి పాత్ర చేశారో నాకర్థం కాలేదు. అంటూ అర్షద్ వార్సీ కామెంట్స్ చేశాడు.
ఇక అమితాబ్ బచ్చన్ పాత్ర గురించి మాట్లాడుతూ అశ్వత్థామ పాత్ర పవర్ ఫుల్ గా ఉందని అన్నాడు. ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఆయన ఎలా చేస్తున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆయనలో ఉన్న శక్తిలో కొంచెమైనా ఉంటే లైఫ్ సెట్ అయిపోతుందని అర్షద్ వార్సీ బిగ్ బీపై ప్రశంసలు కురిపించాడు.
అయితే ప్రభాస్ పై వార్సీ చేసిన కామెంట్స్ పై డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అర్షద్ కామెంట్స్ విని వాళ్లు అప్ సెట్ అయ్యారు. కొత్త జానర్ లో వచ్చే సినిమాలను నటులు ఎందుకు ప్రోత్సహించరు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి ఈర్ష్య వల్లే బాలీవుడ్ ఫెయిల్ అవుతోందని ఇంకో నెటిజన్ అన్నాడు.
ఆ విషయంలో పవన్ నుంచి ఎంతో నేర్చుకోవాలి: Nidhi Agarwal
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu). క్రిష్(Krish), జ్యోతికృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధమవుతోంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు…