Kolkata Doctor Case : ‘‘నా దుర్గ న్యాయం అడుగుతోంది.. నేను ఏ పండుగా చేసుకోలేను’

ManaEnadu:పశ్చిమ బెంగాల్ ((West Bengal)​లోని కోల్​కతా ఆర్​జీకార్ ఆస్పత్రిలో 31ఏళ్ల జూనియర్ డాక్టర్ హత్యాచారానికి ఘటన యావత్ దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆమె స్నేహితుడు తీవ్ర మానసిక వేదనకు లోనవ్వడంతో అతడి కుటుంబ సభ్యులు ఆ యువకుడికి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయట పడుతున్న ఆ వ్యక్తి డాక్టర్ మృతిపై న్యాయం కోసం ఆమె కుటుంబంతో కలిసి పోరాడుతున్నాడు. ఒకే బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ ఘటనకు నిరసగా ఆ ఆస్పత్రి వైద్యులు దాదాపు నెలరోజులుగా రోడ్లపైకి వచ్చి నిరసన (Kolkata Doctors Protests) తెలుపుతున్నారు. తన తోటి డాక్టర్​పై జరిగిన ఈ అఘాయిత్యంపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banergee) చేసిన వ్యాఖ్యలపై మృతురాలి స్నేహితుడు తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చాడు. తనతో లైఫ్ షేర్ చేసుకుంటుదనుకున్న అమ్మాయి ఓ మృగాడి పైశాచానికి బలైపోవడం చూసి ఆ కుర్రాడి గుండె పగిలింది.

తన లైఫ్ పార్టనర్ అవుతుందనుకున్న అమ్మాయి చనిపోయిందని తెలుసుకున్న ఆ యువకుడు ఆమెతో కలిసి బతకాలని కన్న ఎన్నో కలలు ఒక్క రాత్రిలో కల్లలవ్వడం తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్​పై ఆ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోల్​కతా డాక్టర్​ ఘటన(Kolkata Doctor Rape and Murder) జరిగి నెల రోజులు దాటిందని, ఇక ప్రజలు దాన్ని మరిచి దుర్గా పూజకు సిద్ధం కావాలని ఆమె కామెంట్స్ చేశారు.
మమతా బెనర్జీ కామెంట్స్​ను నిరసిస్తూ మరణించిన డాక్టర్ స్నేహితుడు ఓ కవితను రాశాడు. తన స్నేహితురాలు మరణించి నెల దాటినా ఇంకా న్యాయం జరగకపోవడం చూసి తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి కవిత రూపంలో తన బాధను పంచుకుంటూ ఆమె మరణానికి న్యాయం జరగాలంటూ గళమెత్తాడు. ఆ యువకుడి ఆవేదనకు అక్షరరూపం ఇదే.

“ఆనాడు నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రోణాచార్యుడు మౌనంగా ఉండిపోయాడు. శక్తిస్వరూపిణి కొలువైన కోల్​కతా నగరంలో ఓ దుర్గ (మరణించిన డాక్టర్​ను ఉద్దేశిస్తూ) న్యాయం కోసం విలపిస్తోంది. ఓ న్యాయ దేవితా.. నీ కళ్లకు ఇంకా ఆ గంతలెందు న్యాయం కోసం కోల్​కతా నగరం అర్థిస్తోంది. ఈ వేదన భరించలేమంటోంది. నా దుర్గ న్యాయం కోసం పరితపిస్తూ నన్ను అడుగుతుంటే నేను ఏ పండుగూ చేసుకోలేను.” అని అతడు తన ఆవేదనను పంచుకున్నాడు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *