Nag Panchami: నాగ పంచమి.. ఈ ముగ్గులు ఎప్పుడూ రెడీ!

ManaEnadu:శ్రావణమాసం వచ్చేసింది. ఇక ఇప్పటి నుంచి పండుగలు, శుభకార్యాలు అన్నీ వరుసగా వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ముందుగా చేసే పని ఇంటిని అందంగా అలంకరించుకోవడం. దానిలో ముఖ్యమైనది ఇంటి ముందు వేసే ముగ్గు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటీ రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. అలాగే వచ్చాయి ఈ రెడీమేడ్ ముగ్గులు.

పెద్దసైజు పళ్లెంలా ఉండే వీటిల్లో రంగోలి డిజైన్‌ ఆధారంగా ముగ్గుపొడి వేసేంత ఖాళీలు ఉంటాయి. మనకు నచ్చిన రంగుల్ని ఎంచుకుని ఆ ఖాళీల్లో నింపామంటే- చక్కటి ముగ్గు వచ్చేస్తుందంతే. కావాలంటే దీంట్లో పూరేకుల్నో, రంగుల బియ్యాన్నో నింపుకోవచ్చు. సమయం ఉన్నప్పుడు నిదానంగా ముందే రంగుల్ని నింపి అవసరమైనప్పుడు దీన్ని వాకిట్లో పెట్టుకోవచ్చు. అంతేకాదు, కాసేపు దేవుడి ముందు ఉంచిన ఈ రంగోలిని మరికాసేపటికి మనకు నచ్చిన చోటుకూ పట్టుకెళ్లొచ్చు. ఇవి కావాలంటే ఆన్‌లైన్‌లో డెకోడెస్క్‌ ఐలాండ్‌ రంగోలి అని వెతికితే చాలు బోలెడు ఆప్షన్లు వస్తాయి. వాటిలో నచ్చిన వాటిని ఎంచుకొని ఇంటికి తెచ్చేసుకోండి.

నాగ పంచమి ప్రత్యేక పూజలు

హిందూమతంలో నాగుపాముకి విశిష్ట స్థానం ఉంది. దైవంగా భావించి పూజిస్తారు. శివుని మెడలోని ఆభరణం, విష్ణువు శేషతల్పమైన నాగపాముని భక్తితో పూజిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమిని నాగ పంచమి లేదా నాగులు పంచమిగా హిందువులు జరుపుకుంటారు. నాగదేవతను ఆరాధిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. నాగ పంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, ధ్యానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, దర్శనం, పూజ కోసం నాగదేవత ఆలయానికి వెళ్లాలి. ఏదైనా కారణం చేత మీరు ఆలయానికి వెళ్లలేకపోతే.. గోడపై పిండి లేదా నల్ల స్కెచ్‌తో నాగదేవత చిత్రాన్ని తయారు చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజించవచ్చు. 

పూజకు శుభ ముహూర్తం ఇదే

శ్రావణ మాసంలోని శుక్ల పక్షం 5వ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. రేపు ఉదయం 06.01 నుంచి 8.37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అటు వేద పంచాంగం ప్రకారం పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12.36 గంటలకు ప్రారంభమై 10వ తేదీ తెల్లవారుజామున 03.14 గంటలతో ముగుస్తుంది.

  

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *