Mana Enadu:సెర్బియా యోధుడు, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లాడు. ఇదే అతడి కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉండగా.. ఒలింపిక్ గేమ్స్‌లో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. అతడు గతంలో నాలుగు సార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ టెన్నిస్ దిగ్గజం.. గోల్డ్ మెడల్ సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు.

ఒలింపిక్స్‌లో టెన్నిస్ మెన్స్ సింగిల్స్ రెండో సెమీఫైనల్లో జకోవిచ్ ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి వరుస సెట్లలో మట్టికరిపించాడు. పదునైన షాట్లతో, ఏస్‌లు సంధించి 6-4, 6-2తో లొరెంజోపై జయకేతనం ఎగురవేశాడు. గోల్డ్ మెడల్ కోసం జరిగే మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌ను జకో ఢీకొననున్నాడు. మరోవైపు కాంస్య పతకం కోసం జరిగే పోరులో ఫెలిక్స్ అగర్‌ను లొరెంజో ఢీ కొట్టనున్నాడు.
హోరాహోరీ పోరు ఖాయం
ఒలింపిక్స్‌లో జకోవిచ్‌కు ఇది 17వ విజయం. 2008 బీజింగ్ విశ్వ క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న జకో.. ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. అయితే.. నిరుడు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రికార్డు సాధించిన జకో ఈసారి గోల్డ్ మెడల్ లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల వింబుల్డన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో జకోవిచ్ కంగుతిన్నాడు. దీంతో ఫైనల్లో అతడితో జకోకు గట్టిపోటీ ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

జకో ఖాతాలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
నొవాకో జకోవిచ్ కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాల జాబితాలో అగ్రస్థానం అతడిదే. నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రెండో స్థానంలో నిలవగా, ఫెదరర్ 20 టైటిల్స్‌తో మూడో స్థానంలో ఉన్నారు. జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ను 10సార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019,2020, 2021, 2023) గెలుచుకున్నారు. అలాగే ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడు సార్లు ( 2016, 2021, 2023), వింబుల్డన్‌ను ఏడు సార్లు (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022) గెలుచుకున్నాడు.
tags: Olympics,paris,Mens singls,SemiFinals,Tennis2024,Djokovic,Alcaraz






