మన ఈనాడు:ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దేవస్థానం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. శుక్రవారం భక్తులకు పంపిణీ చేసిన పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్క వచ్చిందంటూ.. హరీశ్ రెడ్డి అనే భక్తుడు దేవస్థాన అధికారులకు ఫిర్యాదు చేశాడు. బ్రహ్మాండరాయ గోపురం వద్ద పంచిన పొట్లాల్లో మాంసం ముక్కలు ఉన్నట్లు భక్తులు గుర్తించారు. అధికారుల నిర్వహణపై భక్తులు, హైందవ సంఘాలు మండిపడుతున్నాయి.
గతంలోనూ పరమతస్థులను లోపలికి రానివ్వడం, ప్రధాన పదవులు, టెండర్లు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దైవదర్శనంలోనూ వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.