JOBS: గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన రైల్వే టెక్నీషియన్ పోస్టులు

Mana Enadu: ఇటీవల రైల్వే టెక్నీషియన్(RRB Technician) పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజా వాటికి అదనంగా 5,154 పోస్టులను పెంచారు(Increased). దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 14,298కి చేరింది. గతంలో 18 కేటగిరీల్లో ఖాళీలను ప్రకటించగా.. తాజాగా 40 కేటగిరీల్లోని ఖాళీలను కలిపారు. సికింద్రాబాద్ జోన్(Secunderabad Zone) పరిధిలో 959 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ముంబై జోన్ పరిధిలో 1,883 పోస్టులు, అత్యల్పంగా సిలిగిరి జోన్‌లో 91 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.

ఎంపిక, పరీక్షా విధానం

☞ మొత్తం ఖాళీలు: 14298
☞ అక్టోబర్/నవంబర్‌లో
☞ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
☞ డాక్యుమెంట్ వెరిఫికేషన్
☞ వైద్య పరీక్షలు
☞ జీతం:- గ్రేడ్ 1 సిగ్నల్- రూ. 29,200
☞ గ్రేడ్ 3: రూ. 19,900
☞ అధికారిక వెబ్‌సైట్:- https://indianrailways.gov.in/, https://www.rrbapply.gov.in/

 గేట్‌-2025కు దరఖాస్తుల స్వీకరణ

GATE-2025(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) ఎంట్రన్స్ టెస్టుకు నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంటెక్, పీహెచ్‌డీ(Phd) చేయాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులు సెప్టెంబర్ 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 7వరకు అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఎంట్రన్స్ టెస్ట్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహించనుంది. గేట్ 2025 పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1800, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 30 సబ్జెక్టులకు నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మూడు గంటల పాటు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం 2025 మార్చి 19న ఫలితాలు విడుదల చేస్తారు. మార్చి 28 నుంచి మే 31వరకు స్కోరు కార్డులను అందుబాటులో ఉంచుతారు.

గ్రూప్ 2 పరీక్ష తేదీలు ప్రకటన

TGPSC ఇటీవల గ్రూప్-2 పరీక్ష తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 15, 16తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 2 పోస్టులకు ఈ నెల 7,8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. వారం రోజుల వ్యవధిలో డీఎస్సీ ఎగ్జామ్స్ ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేశారు. ఇప్పటివరకు నాలుగుసార్లు వాయిదా పడ్డ గ్రూప్ 2 పరీక్షలను మరోసారి వాయిదా పడకుండా అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి మరింత సమయం ఇచ్చి టీజీపీఎస్సీ కొత్త తేదీలను ప్రకటించింది. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించగా మెయిన్స్‌కు 31వేల మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు.

Related Posts

SBI Jobs: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులు.. అప్లై చేయండిలా!

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఐదు వేలకు పైగా జూనియర్‌ అసోసియేట్స్‌ (Customer Support and Sales) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ దరఖాస్తులను…

Cognizant: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. డిసెంబరులోపు భారీ నియామకాలు

ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న కాగ్నిజెంట్‌(Cognizan) సంస్థ 2025లో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించాలన్న లక్ష్యంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్యకాలంలో ఈ సంస్థ 7,500 మందిని నియమించుకుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *