ITBP Constable: భద్రతా దళాల్లో చేరాలనుకుంటున్నారా.. ఇదిగో అప్లై చేయండి!

Mana Enadu: దేశ సేవలో భద్రతా దళాలది ముఖ్యపాత్ర. Indian Armyతోపాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీలు దేశం నలువైపులా పగారా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నాయి. దేశసేవతో పాటు ఉద్యోగం సాధించాలన్న యువతకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (టైలర్, కోబ్లర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 10శాతం ఖాళీలు మాజీ సైనికులకు రిజర్వు చేసింది. మహిళలకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. అర్హత గల అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 819 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 2న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1, 2024న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను తెలుసుకుందాం..

మెుత్తం పోస్టులు
➥ పురుషులు: 697 పోస్టులు
➥ మహిళలు: 122 పోస్టులు

 అర్హతలు

➥ గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ, ఫీజు వివరాలు

➥ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET),
➥ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST),
➥ రాత పరీక్ష,
➥ ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్
➥ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME)/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) ఉంటాయి.
➥ దరఖాస్తు రుసుము రూ.100 నిర్ణయించారు.
➥ SC, ST మహిళలు, మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
➥ వెబ్ సైట్: recruitment.itbpolice.nic.in

Related Posts

GOVT JOBS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొలువుల జాతర!

రాష్ట్రంలోని నిరుద్యోగుల(Unemployees)కు తెలంగాణ సర్కార్(Telangana Govt) శుభవార్త చెప్పింది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల(Posts)ను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అన్నిశాఖల్లో నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *