Mana Enadu: నిరుద్యోగులకు RRB (Railway Recruitment Board 2024) శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ నుంచి భారీ నోటిఫికేషన్‌ను అఫీషియల్‌గా విడుదల చేసింది. భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11,558 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేట్(Graduate), అండర్ గ్రాడ్యుయేట్(Undergraduate)-స్థాయి పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..
Total Posts: 11,558
☛ గ్రాడ్యుయేట్ పోస్టులు: 8113
☛ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: 3,445
* దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే
☛ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం SEP 14న మొదలై 13 OCT 2024 వరకు కొనసాగుతుంది.
☛ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు SEP 21 నుంచి 20 OCT 2024 వరకు అప్లై చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ పోస్టులు
☛ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ 1736 పోస్టులు, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 పోస్టులున్నాయి. ఈ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయాలి. AGE 18-36. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో..
☛ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022 పోస్టులు, అకౌంట్ క్లర్క్ 361, ట్రైన్స్ క్లర్క్990, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 72 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి 12వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. AGE 18-33. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష విధానం
☛ ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 1 -CBT 1
☛ ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 2 – CBT 2
☛ టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్
☛ డాక్యుమెంట్ వెరిఫికేషన్
☛ వైద్య పరీక్షలు
పరీక్ష ఫీజు:
☛ రెండూ పరీక్షలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత రూ.400 రీఫండ్ వస్తుంది.
☛ SC, ST,EBC, Ex-Servicemen, Female, Transgenderలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష అనంతరం బ్యాంకు ఛార్జీలు తీసేసి మిగతాది రీఫండ్ చేస్తారు.
ఎలా APPLY చేయాలంటే?
☛ Step1. RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inను సందర్శించండి.
☛ Step2. RRB NTPC 2024 నోటిఫికేషన్‌ను గుర్తించి, దానిని జాగ్రత్తగా చదవండి.
☛ Step3. ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
☛ Step4. కచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
☛ Step5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
☛ Step6. దరఖాస్తు రుసుము చెల్లించండి.
☛ Step7. పూర్తి చేసిన దరఖాస్తును గడువులోపు సమర్పించండి