Mana Enadu: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో ఏప్రిల్-జూన్ మధ్య భారత ఆర్థిక వ్యవస్థ 7.0 నుంచి 7.1శాతం మేర వృద్ధి చెందుతుందని ఎస్బీఐ రీసెర్చ్(SBI Research) నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ప్రపంచ సరకు రవాణా, కంటైనర్ ఖర్చులు, సెమీకండక్టర్ కొరతతో సహా సరఫరా గొలుసు ఒత్తిళ్ల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగానే ఉందని ఎస్బీఐ రీసెర్చ్, గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యా కాంతి ఘోష్ అన్నారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI), తన తాజా ద్రవ్య విధాన సమావేశంలో 2024-25కి సంబంధించి జీడీపీని 7.2శాతంగా అంచనా వేసింది. ఇందులో Q1- 7.1% Q2-7.2%, Q3-7.3%, Q4-7.2శాతంగా ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు 2021-22లో 8.7శాతంగా నమోదైన వృద్ధి రేటు 2022-23లో 7.2శాతం, 2023-24లో 8.2శాతంగా జీడీపీ నమోదైంది. దీంతో ప్రస్తుత ఆర్థిక వృద్ధిరేటును పలు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా సవరించాయి. జులైలో అంతర్జాతీయ ద్రవ్య నిది 2024లో భారత వృద్ధి అంచనాలను 6.8శాతం నుంచి 7 శాతానికి పెంచింది. మరోవైపు గత నెలలో పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం భారత జీడీపీ రేటు 6.5-7శాతంగా నమోదవ్వొచ్చని అంచనా వేసింది.
ఆహార కేటగిరీలోని కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మాంసం, చేపల ధరలు ప్రతిద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ ఆగస్టు MPC రిజల్యూషన్‌లో నిర్దేశించిన అంచనాలకు అనుగుణంగా, సమీప కాలంలో 5%కి దగ్గరగా ఉంచవచ్చు. ఇంధన ధరలు, ప్రధాన ద్రవ్యోల్బణం కొత్త చరిత్రాత్మక కనిష్ఠానికి మరింత దగ్గరగా ఉంటుందని సర్వే నివేదిక పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ద్రవ్యోల్బణం తగ్గడం, నిలిచిపోవడం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద మొత్తంలోనే ప్రభావం చూపుతాయని తెలిపింది. ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి పెను ప్రమాదకరమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.