నార్సింగ్​ ORRపై మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

మనEnadu:నార్సింగీలో సోమవారం మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డు(ORR)పై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌(ORR)పై ప్రమాద సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్‌ అయిన వాహనాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Share post:

లేటెస్ట్