Mana Enadu: భారత్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan) క్రికెట్‌కు రిటైర్మెంట్( retirement) ప్రకటించారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉందని, ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 10వేలకు పైగా రన్స్ చేశారు. అందులో 24 సెంచరీలు ఉన్నాయి.
క్రికెట్ అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధవన్ అంతర్జాతీయ, డొమెస్టిక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆటను ఇకపై ఐపీఎల్‌లోనే చూసే అవకాశం ఉంది. IPLలో ఇప్పటివరకూ 222 మ్యాచులు ఆడిన శిఖర్ రెండు సెంచరీలు, 51 అర్ధ సెంచరీలతో 6769 రన్స్ చేశారు. ఈ ఫార్మాట్‌లో 768 బౌండరీలు, 152 సిక్సులు బాది 102 క్యాచ్‌లు పట్టుకున్నారు. IPLలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ ఈయనే.
భారత్ తరఫున రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఓపెనింగ్ జోడీ సూపర్ సక్సెస్. ముఖ్యంగా వన్డేల్లో వీరిద్దరూ చెలరేగిపోయేవారు. ధవన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడితే రోహిత్ కుదురుకున్నాక ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. వన్డేల్లో హిట్‌మ్యాన్, గబ్బర్ జోడీ 117 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసి 5193 రన్స్ చేసింది. అందులో 18 సెంచరీ, 15 అర్ధ సెంచరీల భాగస్వామ్యాలు ఉన్నాయి.శిఖర్ ధవన్‌కు ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇతడివే. మొత్తం 20 ఇన్నింగ్స్‌ల్లో 1238 రన్స్ చేశారు. సగటు 65, స్ట్రైక్ రేట్ 98గా ఉంది. అందులో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గబ్బర్ రికార్డులివే..
☛ అంతర్జాతీయ క్రికెట్లో 10867 రన్స్.
☛ భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన 12వ ప్లేయర్.
☛ 24 సెంచరీలు, 55 సార్లు 50+ స్కోర్స్ చేసిన ఆటగాడు.
☛ 2018 ఆసియా కప్‌లో అత్యధిక రన్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్.
☛ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక భారత ఓపెనర్.
☛ ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక యావరేజ్.