Mana Enadu:టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(virat kohli) మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. కింగ్ కోహ్లీకి శ్రీలంక(srilanka)పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఈ పరుగుల యంత్రం.. ఆ జట్టుపై బ్యాటింగ్ అంటే చాలు ఊగిపోతాడు. ఇప్పటి వరకు లంకపై 53 వన్డే(odi) మ్యాచులు ఆడిన విరాట్ ఏకంగా 61.2 యావరేజ్‌తో 2,632 రన్స్ చేశాడు. ఇందులో పది సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అయితే ప్రజెంట్ జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం కింగ్ తన పూర్వపు ఫామ్‌ను కనపర్చలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు వన్డేల్లోనూ వరుసగా 24, 14 స్వల్ప స్కోర్లు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీలంకతో జరగనున్న మూడో వన్డేలో విరాట్ రాణిస్తే ఆల్ టైమ్ గ్రేట్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూలర్క్(sachin tendulkar) నెలకొల్పిన ఓ రికార్డును కింగ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరో రికార్డు విషయంలో సచిన్ సరసన కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. అవేంటంటే..
మరో 114 రన్స్ చేస్తే..
లంకపై మూడో వన్డే(3rd odi)లో విరాట్ మరో 114 పరుగులు సాధిస్తే వన్డేల్లో అతడి మొత్తం రన్స్ 14,000 మైలురాయిని చేరుతాయి. అదే జరిగితే వన్డే క్రికెట్ హిస్టరీ (cricket history)లో అత్యంత ఫాస్ట్‌గా 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా విరాట్ రికార్డ్ సృష్టిస్తాడు. సచిన్, కుమార సంగక్కర కంటే ముందుగానే ఈ మైలురాయిని సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. 14000 పరుగుల మైలురాయిని సాధించేందుకు సచిన్ 350 వన్డేలు, సంగక్కర 378 మ్యాచ్‌లు ఆడారు. అయితే కోహ్లీ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
27వేల రన్స్ క్లబ్లో..
ఇంటర్నేషన్ క్రికెట్(international cricket)లో 27వేల రన్స్ కంప్లీట్ చేసేందుకు విరాట్ చేరువయ్యాడు. శ్రీలంకపై మూడో వన్డేలో మరో 78 పరుగులు సాధిస్తే ఈ మైలురాయిని అందుకుంటాడు. కోహ్లీ కంటే ముందు ముగ్గురు దిగ్గజాలు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. సచిన్, సంగక్కర, పాంటింగ్ తర్వాత ఈ రికార్డు సాధించిన ఫోర్త్ ప్లేయర్(4th player)గా కోహ్లీ నిలిచే అవకాశాలు ఉన్నాయి.
అత్యధిక రన్స్ సాధించిన ప్లేయర్లు
1. సచిన్ టెండూల్కర్ – 34,357 రన్స్
2. కుమార సంగక్కర (శ్రీలంక) – 28,016 పరుగులు
3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 27,483 రన్స్
4. విరాట్ కోహ్లీ -26,922