Paris Olympics: నీరజ్ అదరహో.. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన చోప్రా

 

 

youtube link: https://www.youtube.com/watch?v=jMbFUISclyA&t=2s

పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)లో భారత్ అథ్లెట్ల ప్రదర్శన ఆశించినంతగా లేదు. ఇప్పటి వరకు కేవలం 3 కాంస్య పతకాలు మాత్రమే గెలుచుకుంది. ఈ మెడల్స్ అన్నీ షూటింగ్‌(shooting)లోనే దక్కడం విశేషం. ఇప్పటివరకు ఒక్క పసిడి పతకం కాదు కదా రజతం కూడా ఏ ప్లేయర్ నెగ్గలేదు. బ్యాడ్మింటన్‌(badminton)లో పసిడి పతకం వస్తుందని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. మరోవైపు 140 కోట్ల మంది ఉన్న భారత్‌ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ గేమ్స్‌లో పతకాల కోసం ఇంతలా కష్టపడాల్సి వస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్లేయర్లను అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వారు ఇలా కీలక పోరులో తేలిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో బంగారు పతకం ఆశలన్నీ జావెలిన్ త్రోయర్ నీరజ్(neeraj chopra) చోప్రాపైనే ఉన్నాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు సజీవంగా ఉంచాడు. తొలి ప్రయత్నంలో ఫైనల్స్‌కు క్వాలిఫై అవ్వడంతో పాటు.. గ్రూప్-ఎ, గ్రూప్-బిలో సైతం అందరికంటే ఎక్కువ దూరం (89.34 మీటర్లు) ఈటెను విసిరిన క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. దీంతో ఫైనల్స్‌(finals)లో తప్పకుండా నీరజ్ చోప్రా మంచి ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది.

గ్రూప్-ఎలో ఫైనల్స్‌కు అర్హత సాధించి మొదటి స్థానంలో నిలిచిన జర్మనీ(german) ప్లేయర్ 87.76 మీటర్లు విసరగా.. నీరజ్ 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్ చేరాడు. ఆగస్టు 8న జరిగే ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ కోసం పోటీపడతాడు. ప్రపంచస్థాయి పోటీల్లో 89.94 మీటర్ల దూరంలో త్రో చేసిన నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో 89.34 మీటర్లు విసరడం తన రెండో అత్యుత్తమ త్రో. సాధారణంగా ఒలింపిక్స్‌లో 85 మీటర్లు ఎవరైతే త్రో చేస్తారో వారు నేరుగా ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతారు. ఎక్కువమంది 85 మీటర్లు విసిరితే అప్పుడు ఎక్కువ దూరం విసిరిన వాళ్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.

2020 టోక్యో ఒలింపిక్స్‌(tokyo olympics)లో జావెలిన్ త్రో పురుషుల విభాగంలో నీరజ్ చోప్రా బంగారు(gold) పతకం సాధించాడు. అప్పట్లో 87.58 మీటర్లు విసిరి పతకం సాధించాడు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే 1.76 మీటర్లు ఎక్కువ దూరం త్రో చేశాడు. దీంతో పారిస్ ఒలింపక్స్ ఫైనల్స్‌లో జావెలిన్ త్రో పురుషుల విభాగంలో నీరజ్ చోప్రా పతకం సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.

 

Share post:

లేటెస్ట్