Mana Enadu: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat).. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. BJP మాజీ MP, రెజ్లింగ్ ఫెడరేషన్(Wrestling Federation of India (WFI)) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్(brij bhushan sharan singh) శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసులో రోజుల తరబడి ఢిల్లీ నడిరోడ్ల మీద ఆందోళన చేసిన భారత మహిళా రెజ్లర్ (Wrestler). బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన రెజ్లర్లల్లో ఆమె ఒకరు. రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగించిన కుస్తీ యోధురాలు. ఒకానొక సమయంలో ఈ అమ్మాయిని తన్ని, చితకబాది వీధుల్లోకి లాగారు కూడా..
కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం..
వినేశ్ మాత్రమే కాదు.. నిరసన తెలిపిన వారిలో బజరంగ్ పునియా(bajrang punia), సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తదితరులున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్‌కు వ్యతిరేకంగా వీరు ఆందోళనలు చేశారు. వీరంతా కలిసి జంతర్ మంతర్ వద్దే ఫుట్‌పాత్‌పై నిద్రించిన రోజులూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ పోడియం నుంచి ఫుట్‌పాత్ వరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ద్వారా ఎన్నో అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నామని, తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మీడియా ఎదురుగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం.
https://twitter.com/IacGaurav/status/1820790000344023306/video/1
చారిత్రాత్మక విజయం
అలాంటి వినేశ్ ఫొగట్.. పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. పతకం వైపు అడుగులు వేసింది. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో భాగంగా జరిగిన 16వ రౌండ్ పోటీల్లో ఘన విజయం సాధించింది. 3-2 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన యుయి సుసాకీని మట్టికరిపించింది. యుయి సుసాకీ అల్లాటప్పా రెజ్లర్ కాదు. వరల్డ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో గతంలో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కూడా అందుకుంది.
ఇక స్వల్ప వ్యవధిలో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ల్లో వినేశ్ తన పట్టేంటో ప్రత్యర్థికి రుచి చూపించింది. అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రొవోకేషన్‌ను 7-5 పాయింట్ల తేడాతో ఓడించింది. దీంతో సెమీస్‌లోకి ఎంటర్ అయింది. కాగా..ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.