Mana Enadu: పారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మునుపెన్నడూ లేనిరీతిలో రికార్డులు సృష్టిస్తున్నారు. కొంతమంది కడదాకా పోరాడి పతకాలు సాధిస్తుంటే.. మరికొంత మందిని చివరి నిమిషంలో ఆట నిరాశ పరుస్తోంది. ఈ క్రమంలో ఏళ్ల తరబడి పడిన కష్టమంతా వృథా అయిందని క్రీడాకారులు కంటతడి పెడుతూ భారమైన హృదయంతో వెనుదిరుగుతున్నారు. అయితే కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు.. వారికి ఆటన నేర్పి వెన్నంటే ఉండి కోచింగ్ ఇచ్చిన కోచ్ లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ కోచ్ మాథియాస్ బో షాకింగ్ డెసిషెన్ తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారనుకున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిపాలైంది. దీంతో ఈ ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది. వీరికి కోచింగ్ ఇచ్చిన ప్రముఖ కోచ్, హీరోయిన్ తాప్సీ భర్త మథియాస్ బో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. కోచింగ్ బాధ్యతలకు తాను గుడ్ బై చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘‘నా కోచింగ్ డేస్ ముగిసిపోయాయి. ఇక భారత్‌లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా కోచ్‌గా వ్యవహరించను. నా లైఫ్‌లో సుదీర్ఘ సమయాన్ని బ్యాడ్మింటన్ హాల్‌లోనూ గడిపేశాను. కోచ్ బాధ్యత కొంత ఒత్తిడితో ఉంటుంది. అందుకే అలసిపోయాను. నాకు కోచ్‌గా బాధ్యత ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. భారత్‌తో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి’’ అని మథియాస్ బో తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇక ఈ ఒలింపిక్స్ ఓడిపోయిన సాత్విక్ – చిరాక్ జోడీపై ప్రశంసలు కురిపించారు బో. వారిలో ఎంత బాధ దాగి ఉందో అర్థం చేసుకోగలనని.. ఎంతో కష్టపడినా ఆశించిన ఫలితం దక్కలేదని అన్నారు. భారత్‌కు తిరిగి మెడల్‌ను తీసుకెళ్లాలని బలంగా అనుకున్నా ఈ సారి ఆ అవకాశం దక్కకపోయినా ఈ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనే చేశారని ప్రశంసించారు. గాయాలను తట్టుకుని, అంకిత భావంతో ముందుకెళ్లారని.. ఈ విధంగా ఆడినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని కీర్తించారు.
మథియాస్ బో కెరీర్ విషయానికొస్తే డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌ను ముద్దాడాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్ – చిరాగ్ జోడీకి కోచ్‌గా జాయిన్ అయ్యాడు. ఈ ఏడాది మార్చి నెలలో హీరోయిన్ తాప్సీని సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాడు.
Satwik Sairajrankireddy Chirag Shetty, Paris Olympics 2024, Tapsee husband Mathias Boe, Tapsee husband Mathias Boe retirement, Indian badminton coach Mathias Boe retirement, Mathias Boe quits coaching