MSD:మహేంద్రుడి కోసమే మళ్లీ ఆ రూల్ తీసుకొస్తున్న BCCI?

ManaEnadu:‘‘ధోనీ… ఫినిషస్ ఆఫ్ ఇన్ స్టైల్.. ఏ మెగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్‌ టు ది క్రౌడ్.. ఇండియా లెఫ్ట్ ది వరల్డ్ కప్.. ఆఫ్టర్ 28 ఇయర్స్.. ది పార్టీ స్టార్ట్స్ ఇన్‌ టు ది డ్రెస్సింగ్ రూమ్’’ 2011 వరల్డ్ కప్‌(WC-2011)ఫైనల్లో శ్రీలంకపై భారత్ గెలిచిన తర్వాత కామెంటేటర్ రవిశాస్త్రి చెప్పిన ఈ మాటలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మెదులుతూనే ఉన్నాయి. అందుకు రీజన్ ఏంటి, ఎవరో.. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓడిపోతున్న మ్యాచ్‌ను కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌పై తిప్పాడు. ఇక తన కెరీర్లో మన మహేంద్రుడు ఎన్నో చిరస్మరణీయ విజయాలు భారత్‌కు అందించాడు. 2007 టీ 20 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించి భారత క్రికెట్లో తనముద్ర వేశాడు మాహీ.

బీసీసీఐ అంత సాహసం చేస్తుందా?

అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికినా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో మాత్రం కొనసాగుతున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్‌(CSK)కు కెప్టెన్‌గా ఏకంగా ఐదు టైటిళ్లను సాధించిపెట్టాడు ధోనీ. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నారా? అవును అవసరమే. క్రికెట్‌లో, మైదానంలో ధోనీ మేనియా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్కోసారి ధోని లేని మ్యాచులను చూసేందుకు అభిమానులు కూడా పెద్దగా స్టేడియాలకు రాని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదేమో. తాజా సీజన్‌లో సీఎస్కే టీమ్ కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ సారథ్య బాధ్యతలను యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. అయితే కెప్టెన్ కాకపోయినా టీమ్‌ను అన్నీ తానై నడిపిస్తున్నాడు కూడా. అయితే వచ్చే సీజన్​లో మాహీ ఆడతాడా? లేదా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ధోనీ కోసం BCCI తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 CSK ప్లాన్ అదేనా..

ధోని ఇంకొన్నాళ్లు జట్టుతోనే ఉండాలని భావిస్తున్న సీఎస్​కే యాజమాన్యం అతడ్ని వదులుకోకూడదని ఫిక్స్ అయింది. అయితే ఈ ఏడాది ఆఖర్లో మెగా ఆక్షన్ ఉండటంతో మాహీని రీటెయిన్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అతడి కోసం భారీ మొత్తాన్ని వెచ్చిస్తారా? అనేది అనుమానంగా మారింది. అయితే అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ధోనీని దక్కించుకోవాలనేది చెన్నై ప్లాన్ అని తెలిసింది. రీసెంట్​గా బీసీసీఐతో ఫ్రాంచైజీల మీటింగ్​లో ఇదే విషయాన్ని సీఎస్​కే స్పష్టంగా చెప్పిందట. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇంటర్నేషనల్ క్రికెట్​ నుంచి రిటైరై 5 ఏళ్లు దాటిన ఆటగాళ్లను అన్​క్యాప్డ్ ప్లేయర్​గా ప్రకటించే నిబంధనను మళ్లీ పునరుద్ధరిస్తోందట. ఒకవేళ ఈ రూల్ అమల్లోకి వస్తే మాహీ నెక్స్ట్‌ ఐపీఎల్​ ఆడటం పక్కా. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..

Share post:

లేటెస్ట్