ManaEnadu: కేంద్ర సాయుధ బలగాల్లో చేరాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లోని ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటివి ఉన్నాయి. 2025లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, రైఫిల్‌మ్యాన్ (GD)లో కానిస్టేబుల్ (SSC Constable GD Recruitment 2025) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఖాళీ వివరాలు & అర్హతలు, నోటిఫికేషన్, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
☛ పోస్ట్ పేరు: SSC కానిస్టేబుల్ GD, 2025
☛ నోటిఫికేషన్ తేదీ: 06-09-2024
☛ మొత్తం ఖాళీలు: 39,481
☛ వెబ్‌సైట్: https://ssc.gov.in/login
దరఖాస్తు ఫీజు ఎంతంటే…
☛ అభ్యర్థులందరికీ: రూ. 100/
☛ మహిళలు/ SC/ ST/ మాజీ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
☛ చెల్లింపు విధానం: వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు.
ముఖ్యమైన తేదీలు
☛ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 05-09-2024 నుంచి
☛ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14-10-2024 (రాత్రి 11గం. వరకు)
☛ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ, 15-10-2024 (రాత్రి.11గం. వరకు)
☛ ‘దరఖాస్తు ఫారమ్ ఎడిట్ చేసుకోవడం, ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు తేదీలు: 05-11-2024 నుంచి 07-11-2024 వరకు
☛ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తాత్కాలిక షెడ్యూల్: జనవరి – ఫిబ్రవరి 2025
☛ వయోపరిమితి (01-01-2025 నాటికి)
☛ కనీస వయస్సు: 18 సంవత్సరాలు
☛ గరిష్ఠ వయస్సు: 23 సంవత్సరాలు
☛ అభ్యర్థులు సాధారణ కోర్సులో 02-01-2002 కంటే ముందు, 01-01-2007 తర్వాత జన్మించి ఉండకూడదు.
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
☛ అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పాసై ఉండాలి.
ఖాళీ వివరాలు ఇలా..
☛ BSF విభాగంలో మొత్తం 15,654 పోస్టులు ఉండగా పురుషులకు 13,306, మహిళలకు 2,348 ఖాళీలు ఉన్నాయి.
☛ CISFలో మొత్తం 7,145 పోస్టులు ఉండగా పురుషులకు 6,430, మహిళలకు 715 ఖాళీలు ఉన్నాయి.
☛ CRPFలో మొత్తం 11,541 పోస్టులు ఉండగా పురుషులకు 11,299, మహిళలకు 242 ఖాళీలు ఉన్నాయి.
☛ SSBలో మొత్తం 819 పోస్టులు ఉండగా పురుషులకు 819, మహిళలకు 0 ఖాళీలు ఉన్నాయి.
☛ ITBPలో మొత్తం 3,017 పోస్టులు ఉండగా పురుషులకు 2,564, మహిళలకు 453 ఖాళీలు ఉన్నాయి.
☛ ARలో మొత్తం 1,248 పోస్టులు ఉండగా పురుషులకు 1,148, మహిళలకు 100 ఖాళీలు ఉన్నాయి.
☛ SSFలో మొత్తం 35 పోస్టులు ఉండగా పురుషులకు 35, మహిళలకు 0 ఖాళీలు ఉన్నాయి.
☛ NCBలో మొత్తం 22 పోస్టులు ఉండగా పురుషులకు 11, మహిళలకు 11 ఖాళీలు ఉన్నాయి.