JOBS: విద్యుత్ శాఖలో త్వరలో 3 వేల ఖాళీలు!

ManaEnadu: తెలంగాణ విద్యుత్ సంస్థ(Telangana Electricity Companies)ల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. జాబ్ క్యాలెండర్(Job calendar) ప్రకారం అక్టోబర్‌లో నోటిఫికేషన్(Notification) వెలువడే అవకాశం ఉంది. ఖాళీల వివరాలను పంపాలని విద్యుత్ సంస్థలను అడిగినట్లు సమాచారం. దీంతో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థల్లో 3వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తేలింది. పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. వీటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్(Direct Recruitment) ద్వారా భర్తీ చేయనున్నారు. డిస్కం, ట్రాన్స్‌కో(DISCOM, TRANSCO)లో ఉన్న ఉద్యోగులకు ఇటీవల పదోన్నతులు కల్పించడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. జెన్‌కో(Genco) మరికొందరికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. దీంతో కింది స్థాయిలో భారీగా ఖాళీలు ఉండనున్నాయి. డిస్కంలలో అసిస్టెంట్ లైన్‌మెన్(Assistant Linemen), జూనియర్ లైన్‌మెన్(Junior linemen), సబ్ ఇంజినీర్లు(Sub Engineers), అసిస్టెంట్ ఇంజినీర్(Assistant Engineer) పోస్టులు, ట్రాన్స్‌కో, జెన్‌కోలలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

 SBIలో 1511 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 1511 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(Specialist Cadre Officer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 4లోపు దరఖాస్తు చేసుకోగలరు. BE, BTech, MCA, MTech, MSC ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు డిప్యూటీ మేనేజర్(Deputy Manager) పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య, అసిస్టెంట్ మేనేజర్(Assistant Manager) పోస్టులకు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ(Interview), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్(Medical Examination) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ముంబై/ HYDలో పని చేయాల్సి ఉంటుంది.
* వెబ్‌సైట్: https://sbi.co.in/

ఆ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

జవహర్ నవోదయ(Jawahar Navodaya) విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి గడువును సెప్టెంబర్ 23 వరకు పొడిగించారు. దరఖాస్తుకు సెప్టెంబర్ 16 ఆఖరు తేదీ కాగా విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 1, 2013 నుంచి జులై 31, 2015 మధ్య జన్మించినవారు దరఖాస్తుకు అర్హులు. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్-2025 ఫేజ్-1 ఎగ్జామ్ నవంబర్‌లో, ఫేజ్-2 ఎగ్జామ్ జనవరి 2025లో నిర్వహిస్తారు. మెరిట్(Merit) ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదవుకోవచ్చు. రెసిడెన్షియల్(Residential) విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందస్తారు.
* వెబ్‌సైట్: https://navodaya.gov.in/

Share post:

లేటెస్ట్